AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా వచ్చి 22ఏళ్లు.. కుర్రాళ్ళు థియేటర్స్‌లో ఎగబడి చూశారు.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీ

కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేస్తాయి. ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టని సినిమాలు మన ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి వాటిలో ఈ సినిమా ఒకటి, ఈ సినిమా వచ్చి దాదాపు 22 ఏళ్లు అవుతుంది. అయినా కూడా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

సినిమా వచ్చి 22ఏళ్లు.. కుర్రాళ్ళు థియేటర్స్‌లో ఎగబడి చూశారు.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీ
Movie
Rajeev Rayala
|

Updated on: May 20, 2026 | 1:38 PM

Share

2004లో విడుదలైన 7/జీ  బృందావన్ కాలనీ (తమిళంలో 7/జీ రెయిన్‌బో కాలనీ) చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక విభిన్నమైన చిత్రంగా నిలిచింది. దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించిన ఈ ప్రేమకథ రియలిస్టిక్ ట్రీట్‌మెంట్‌తో, బోల్డ్ కంటెంట్‌తో యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు గడిచినా, నేటికీ అనేకమందికి ఇది ఒక కల్ట్ క్లాసిక్‌గా, తమ అభిమాన చిత్రాలలో ఒకటిగా మిగిలిపోయింది. దర్శకుడు సెల్వరాఘవన్ తన మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత, ఏ.ఎం. రత్నం బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. తన కాలేజీ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించారు. ఒక పంజాబీ అమ్మాయిని ఇష్టపడి ఆమె కోసం చేసిన ప్రయత్నాలను కథలో చూపించారు. కథ చాలా సహజంగా, బోల్డ్‌గా ఉండటం విశేషం. హీరో పాత్ర కోసం మొదట సిద్ధార్థ్‌, మాధవన్‌ వంటి స్టార్ హీరోలను పరిశీలించారు. మాధవన్‌ నో చెప్పడం, సిద్ధార్థ్‌ నువ్వు వస్తానంటే నేను వద్దంటా సినిమాతో బిజీగా ఉండటంతో, కొత్త హీరో కోసం వెతికారు. ఈ క్రమంలో ఏ.ఎం. రత్నం కుమారుడు రవికృష్ణ ఆఫీస్‌కు రాగా, అతడిని చూసిన సెల్వరాఘవన్ హీరో పాత్రకు సరిపోతాడని భావించి ఎంపిక చేశారు.

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

రవికృష్ణ మొదట్లో సీరియస్‌గా తీసుకోకపోయినా, సెల్వరాఘవన్ పట్టుబట్టడంతో లుక్ టెస్ట్‌కు ఒప్పుకున్నారు. ఆ తర్వాత నటనలో శిక్షణ కోసం లండన్‌కు పంపారు. హీరోయిన్ ఎంపికలో కూడా ఇదే విధమైన ప్రక్రియ జరిగింది. మొదట జెనీలియాను అనుకున్నప్పటికీ, కథలో హీరోయిన్ ఒక పంజాబీ అమ్మాయి కావడంతో, నిజమైన పంజాబీ అమ్మాయి అయితే బాగుంటుందని భావించి సోనియా అగర్వాల్‌ను ఎంపిక చేశారు. హీరో హీరోయిన్ల ఫోటో షూట్ తర్వాత వారిద్దరూ పర్ఫెక్ట్ మ్యాచ్ అని నిర్ధారించుకున్నారు. యువన్‌ శంకర్‌ రాజా ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 7G బృందావన్ కాలనీలోని హీరో పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. కాలేజీ బంక్ కొడుతూ, స్నేహితులతో జులాయిగా తిరుగుతూ, మధ్య తరగతి యువకుడిగా రవి పాత్రను మలిచారు. మరోవైపు హీరోయిన్ అనిత అందానికి, ఆకర్షణకు కేరాఫ్ అడ్రస్. ఇలాంటి విభిన్న నేపథ్యాల మధ్య ప్రేమ ఎలా చిగురించిందనేది ఆసక్తికరంగా చూపించారు. కొన్ని బోల్డ్ సన్నివేశాలతో కథను నడిపిస్తూ, చివరికి అది స్వచ్ఛమైన ప్రేమ కథ అని దర్శకుడు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

ఈ సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు హీరో పాత్రను విమర్శించారు. అయితే యువత మాత్రం ఈ సినిమాకు పిచ్చెక్కిపోయింది. థియేటర్లు కాలేజీ విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి. జులాయిగా తిరిగే హీరో, అతని తండ్రి, హీరోయిన్, కాలేజ్ నేపథ్యం  ఇవన్నీ నిజ జీవితంలో మన చుట్టూ కనిపించే పాత్రల్లా ఉండటంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. హీరో, అతని తండ్రి మధ్య వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా తండ్రి కొడుకును తిట్టిన తర్వాత అతను ప్రయోజకుడు అయినప్పుడు చంద్రమోహన్ కంటతడి పెట్టించే సన్నివేశం, సినిమాకే హైలైట్‌గా నిలిచింది. హీరోయిన్‌పై హీరోకు ఉన్న ప్రేమను చూపించే సన్నివేశాలు, ఆమె చనిపోయిన తర్వాత పిల్లోస్, బెడ్స్‌ పట్టుకొని హీరో పిచ్చివాడిలా పరిగెత్తే సన్నివేశం ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. హీరోయిన్ జ్ఞాపకాల్లో హీరో జీవించడం అనే థీమ్‌కు ప్రేక్షకులు బాగా కదిలిపోయారు. యువన్‌ శంకర్‌ రాజా అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి కీ రోల్ ప్లే చేసింది. ఆయన అందించిన నేపథ్య సంగీతం ఇప్పటికీ లక్షలాది మందిని ఆకట్టుకుంటోంది. పాటలు బంపర్ హిట్‌గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us