చీరలో చందమామలా.. యంగ్ బ్యూటీ క్యూట్ ఫొటోస్

samatha

22 may 2026

యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది తన క్యూట్‌నెస్‌తో ఎంతో మంది మదిని దోచుకుంది.

ప్రియాంక మోహన్

నాని సరసన గ్యాంగ్ లీడర్ మూవీతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చిన ఈ చిన్నది తన మొదటి సినిమాతోనే అందరి మనసు దోచుకుంది.

గ్యాంగ్ లీడర్ మూవీ

ఈ మూవీలో తన నటనతో ప్రతీ ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ అమ్మడుకు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది.

పవర్ స్టార్ సరసన ఛాన్స్

పవన్ కళ్యాణ్ సరసన ఓజీ మూవీలో నటించి , తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీతో ఈ ముద్దుగుమ్మ సక్సెస్ లిస్ట్‌లోకి చేరి పోయింది.

ఓజీ మూవీ

ఇక ఓజీ మూవీతో ఈ అమ్మడు లైఫ్ పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తుంది. వరసగా తెలుగులో అవకాశాలు అందుకుంటుందంట.

లైఫ్ ఛేంజ్

అంతే కాకుండా టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లో కూడా ఈ బ్యూటీ తన సత్తా చాటుతున్నట్లు తెలుస్తుంది. సక్సెస్ ఫుల్‌గా తన కెరీర్ రన్ చేస్తోంది.

టాలీవుడ్, కోలీవుడ్

ఇక ఈ బ్యూటీ ఏ కాస్త సమయం దొరికినా సరే తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంటుంది. తాజాగా చీరలో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది

సోషల్ మీడియా

పింక్ చీరలో చాలా సింపుల్ లుక్‌లో ఈ ముద్దుగుమ్మ అందంగా కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.

పింక్ చీర