వెన్నల వెలుగుల్లో మాత్రమే వికసిస్తాయి..ఈ పూలు చేసే మ్యాజిక్ గమ్మతైనదే!

samatha

22 may 2026

ప్రకృతిలో ఎన్నో వింతలు, వినోదాలు దాగున్నాయి. అవి మానవులను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎన్నో విశేషాల గురించి తెలుసుకుంటున్నారు.

ప్రకృతి

అలాగే ప్రపంచంలో ఎన్నో రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే పూలలో కొన్ని ఉదయం పూస్తే, మరి కొన్ని పూలు రాత్రి సమయంలో పూస్తుంటాయి.

రక రకాల పూలు

కాగా, ఇప్పుడు మనం రాత్రి సమయంలో మాత్రమే వికసించే, అందమైన తెలుపు రంగు పూల గురించి తెలుసుకుందాం. అవి ఏవి అంటే?

రాత్రి సమయంలో వికసించే పూలు

రాత్రి సమయంలో మాత్రమే వికసించే పూలలో మల్లె పూలు ముందుంటాయి. ఇవి రాత్రి అద్భుతమైన సువాసనను వెదజల్లుతూ, విరబూస్తాయి.

మల్లె పూలు

మూన్ ఫ్లవర్ ఇది ఒక అందమైన పువ్వు. ఈ పువ్వు కూడా కేవలం పున్నమి వెలుగుల మధ్యనే వికసిస్తుందంట. దీని నుంచి ఒక రకమైన తీపి వాసన వస్తుంది.

మూన్ ఫ్లవర్

చాలా పవిత్రమైన పూలలో బ్రహ్మ కమలం ఒకటి. అయితే ఈపూలు కూడా కేవలం రాత్రి సమయంలో మాత్రమే వికసిస్తాయి. ఇవి ఇంటిలో పూయడం అదృష్టం.

బ్రహ్మ కమలం

ట్యోబరస్ పూలు వీటిని నేల సంపెంగ అని కూడా అంటారు. వీటి వాసన చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే  ఈ పూలు కూడా రాత్రి సమయంలో మాత్రమే వికసిస్తాయి.

ట్యోబరస్ పూలు

ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్. ఈ పువ్వు కూడా కేవలం రాత్రి సమయంలో , చంద్రుడి కిరణాలు తాకగానే వికసిస్తాయంట. చాలా అందమైన పూలలో ఇవి కూడా ఒకటి.

ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్