AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో తాటిముంజలు తింటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే.. 90శాతం మందికి ఇవి తెలియదు

వేసవిలో భానుడి భగభగలకు బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంటుంది. శరీరాన్ని చల్లబరుచుకోవడానికి మనం వెంటనే పుచ్చకాయలు, కొబ్బరి బొండాల వైపు పరుగెడుతుంటాం. అయితే వీటన్నింటికంటే వేగంగా శరీరానికి చల్లదనాన్ని, తక్షణ శక్తిని ఇచ్చే ఒక అద్భుతమైన అమృతం మార్కెట్లోకి వచ్చేసింది. అదే తాటిముంజలు. మరి ఈ ఎండకాలంలో తాటిముంజలు తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం..

వేసవిలో తాటిముంజలు తింటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే.. 90శాతం మందికి ఇవి తెలియదు
Ice Apple Benefits
Krishna S
|

Updated on: May 22, 2026 | 8:21 AM

Share

భానుడి భగభగలకు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ తీవ్రమైన వేసవి ఎండల నుండి శరీరాన్ని చల్లబరిచి, సహజంగా తేమగా ఉంచుకోవడానికి వైద్యులు, ఆహార నిపుణులు రకరకాల పండ్లను తినాలని సూచిస్తున్నారు. వేసవి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి పుచ్చకాయ, కర్బూజా, కొబ్బరి నీళ్లు. కానీ ఇప్పుడు వీటన్నింటినీ తలదన్నేలా ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సూపర్ ఫుడ్ తాటిముంజలు మళ్లీ విపరీతమైన ప్రాచుర్యంలోకి వచ్చాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ఇవి పుచ్చకాయ, కర్బూజా కంటే అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి.

పోషకాల గని.. ఈ ఐస్ ఆపిల్

భారతదేశంలోని తీర ప్రాంతాలు, వేడి ఎక్కువగా ఉండే రాష్ట్రాలలో లభించే తాటిముంజలు వేసవి ఆరోగ్యానికి ఒక వరంగా భావిస్తారు. పారదర్శకమైన, మృదువైన, రసవంతమైన గుజ్జుతో ఉండే తాటిముంజలు శరీరంలో నీటి లోటును క్షణాల్లో భర్తీ చేస్తాయి. ఇందులో నీటి శాతం చాలా ఎక్కువగా ఉండటంతో పాటు మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. సహజ ఎలక్ట్రోలైట్లు, కాల్షియం, విటమిన్లు, పీచుపదార్థం, సహజ చక్కెరలు ఉంటాయి. తక్కువ కేలరీలు, ఎక్కువ నీటి శాతం ఉండటం వల్ల వేసవిలో డీహైడ్రేషన్‌ను నివారించడంలో దీనికి సాటి మరేదీ లేదు.

తాటిముంజలు తినడం వల్ల కలిగే టాప్ ప్రయోజనాలు..

తక్షణ శక్తి – అలసట నుంచి ఉపశమనం

తాటిముంజలలో సహజ ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండ వల్ల కలిగే బలహీనత, తల తిరగడం, లేదా తీవ్రమైన అలసటను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా చెమట పట్టే వారికి ఇది ఒక సహజ నివారణి.

కడుపు ఉబ్బరం, ఎసిడిటీకి చెక్

వేసవిలో చాలా మంది ఎసిడిటీ, అజీర్ణం, కడుపులో మంట లేదా మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి సమయాల్లో తాటిముంజలు తినడం వల్ల కడుపు చల్లబడి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బాడీ హీట్‌ను తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాల్లో దీనిని ఒక సాంప్రదాయ గృహ నివారణగా వాడతారు.

చర్మ సంరక్షణ – సహజ కాంతి

పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల చర్మంపై దద్దుర్లు, చెమటకాయలు, చర్మపు చికాకు పెరుగుతాయి. ముంజలలోని నీరు, ఖనిజాలు చర్మాన్ని లోపలి నుండి తేమగా ఉంచుతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరం నుండి విషపదార్థాలు బయటకు పోయి, చర్మం సహజ కాంతితో మెరుస్తుంది.

బరువు నియంత్రణ

చాలా మంది వేసవిలో దాహం వేస్తోందని ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్, చక్కెర రసాలు, ఐస్ క్రీములు తిని బరువు పెరుగుతుంటారు. వీటికి బదులుగా తాటిముంజలను బెస్ట్ ఆల్టర్నేటివ్‌గా చెప్పవచ్చు. ఇవి తింటే కడుపు నిండిన అనుభూతి కలిగి, పదే పదే తినాలనే కోరిక తగ్గుతుంది. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

అయితే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

తాటిముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

షుగర్ పేషెంట్లు: మధుమేహం ఉన్నవారు ఇందులో సహజ చక్కెరలు ఉండటం వల్ల, వైద్యుల సలహా మేరకు మాత్రమే పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

పరిశుభ్రత ముఖ్యం: రోడ్ల పక్కన ముంజలు కొనేటప్పుడు ఈగలు వాలకుండా, శుభ్రమైన వాతావరణంలో తీసినవి మాత్రమే తీసుకోవాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు, వేడి సమస్యలకు తాటిముంజలు అత్యంత రుచికరమైన, సహజమైన, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. కాబట్టి ఈ వేసవిలో పుచ్చకాయలతో పాటు మీ డైట్‌లో ఐస్ ఆపిల్‌ను తప్పక చేర్చుకోండి.

Follow Us