ఆగని ఆర్టీసీ సమ్మె.. నెక్ట్సేంటి..?

ఆగని ఆర్టీసీ సమ్మె.. నెక్ట్సేంటి..?

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 16వ రోజుకి చేరుకుంది. హైకోర్టు ఆదేశాల్ని కూడా ప్రభుత్వం పక్కన పెట్టడంతో.. ఆర్టీసీ జేఏసీ సీఎం తీరుపై మండిపడుతోంది. ప్రభుత్వం వెనక్కు తగ్గి చర్చలకు రాకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని.. తాము చేపట్టే ఆందోళనల వల్ల ప్రజలు ఇబ్బందులు పడితే అందుకు ప్రభుత్వమే కారణం అవుతుందని కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఈనెల (అక్టోబర్ 23)న ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహించి.. మరోసారి తమ గొంతు వినిపిస్తామని సవాల్ విసిరారు. సమ్మెలో […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Oct 20, 2019 | 8:25 AM

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 16వ రోజుకి చేరుకుంది. హైకోర్టు ఆదేశాల్ని కూడా ప్రభుత్వం పక్కన పెట్టడంతో.. ఆర్టీసీ జేఏసీ సీఎం తీరుపై మండిపడుతోంది. ప్రభుత్వం వెనక్కు తగ్గి చర్చలకు రాకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని.. తాము చేపట్టే ఆందోళనల వల్ల ప్రజలు ఇబ్బందులు పడితే అందుకు ప్రభుత్వమే కారణం అవుతుందని కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఈనెల (అక్టోబర్ 23)న ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహించి.. మరోసారి తమ గొంతు వినిపిస్తామని సవాల్ విసిరారు.

సమ్మెలో భాగంగా ఆదివారం ప్రజలకు గులాబీలు ఇచ్చి ఆర్టీసీ ప్రాముఖ్యత, అవసరాన్ని వివరించనున్నారు. ఇక ఉదయం 11.30కి సుందరయ్య భవన్‌లో రాజకీయ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇక ఇప్పటివరకూ సమ్మె ఎలా జరిగింది? ఇకపై ఎలా జరగాలి అన్నదానిపై చర్చిస్తారు. కాగా, ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిస్తే తమకు సమ్మతమేనని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చేలా కనిపించడం లేదు. ఇదిలా వుంటే, ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వని ప్రభుత్వం.. అద్దె బస్సులకు కూడా ఇవ్వాల్సిన అద్దె ఇవ్వలేదు. దీంతో తమ పరిస్థితి ఏంటని అద్దె బస్సుల యజమానులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సమ్మె వల్ల తమకు డబ్బులు ఆపేస్తే ఎలా అంటున్నారు. ఆర్టీసీలో మొత్తం 10,460 బస్సులు ఉండగా.. వాటిలో 2103 అద్దె బస్సులు ఉన్నాయి. కొత్త బస్సులకు బదులు ప్రభుత్వం ప్రైవేట్ బస్సులకు అద్దె చెల్లిస్తూ నడిపిస్తోంది. ఒక్కో బస్సుకూ నెలకు రూ.లక్ష దాకా చెల్లిస్తోంది. ఆ లెక్కన ప్రస్తుతం మొత్తం రూ.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు అద్దె డబ్బులు చెల్లించకపోవడంతో తాము తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కుదరడం లేదని ఆపరేటర్లు మత్తుకుంటున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu