AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయనుందా..?

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారం నిన్నటితో ముగిసింది. పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎంపీగా గెలవటంతో..ఈ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో..ఇక్కడ జరగుతున్న ఉప ఎన్నిక ద్వారా పార్టీ పట్టు..వ్యక్తిగతంగా ఉత్తమ్ రాజకీయ భవిష్యత్ కు ఈ ఎన్నిక కీలకంగా మారింది. ప్రచారాల పైన అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ విడుదల అయిన వెంటనే అభ్యర్దిని రంగంలోకి దించారు. పార్టీ నేతలను గ్రామ గ్రామాన మొహరించారు. బీజేపీ..టీడీపీ అభ్యర్ధులు సైతం బరిలో ఉన్నారు. […]

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయనుందా..?
Ram Naramaneni
| Edited By: |

Updated on: Oct 20, 2019 | 7:13 AM

Share

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారం నిన్నటితో ముగిసింది. పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎంపీగా గెలవటంతో..ఈ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో..ఇక్కడ జరగుతున్న ఉప ఎన్నిక ద్వారా పార్టీ పట్టు..వ్యక్తిగతంగా ఉత్తమ్ రాజకీయ భవిష్యత్ కు ఈ ఎన్నిక కీలకంగా మారింది. ప్రచారాల పైన అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ విడుదల అయిన వెంటనే అభ్యర్దిని రంగంలోకి దించారు. పార్టీ నేతలను గ్రామ గ్రామాన మొహరించారు. బీజేపీ..టీడీపీ అభ్యర్ధులు సైతం బరిలో ఉన్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఇక్కడ ఉప ఎన్నిక మీద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అధికార పార్టీ ఒక వైపు..ప్రతిపక్షాల వైపు ఒక వైపు అన్నట్టుగా ఈ ఎన్నిక మారింది. దీంతో..ఇది వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు పరీక్షగా మారుతోంది. చివరి రోజు ప్రచారం ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు అన్ని పార్టీలు చివరి ప్రయత్నాలు చేశాయి.

కాంగ్రెస్ గెలవకపోతే: 

హుజూర్ నగర్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. 2009 నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఒకవేళ ప్రస్తుత ఉప ఎన్నికలో పద్మావతి గెలువకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన పీసీసీ పదవి ఈ గెలుపు పైన ఆధారపడి ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ లో కొత్త అభ్యర్థిని నిలపడానికి ప్రయత్నించగా ఉత్తంకుమార్ రెడ్డి అడ్డుకున్నాడు. తన భార్యనే అభ్యర్థిగా సోనియా గాంధీని ఒప్పించాడు. ఈ నేపథ్యంలోనే హుజూర్ నగర్ లో గెలుపు ఉత్తమ్ స్టామినాకు, ఆయన పీసీసీ పదవికి లంకెగా మారింది. భార్యని గెలిపిస్తేనే ఉత్తం పీసీసీ చీఫ్‌గా కొనసాగే అవకాశం ఉంది. లేదంటే పీసీసీ పోస్ట్‌తో పాట పరువు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి.

అందుకే ఉత్తమ్ తన భార్య ని గెలిపించేందుకు పీసీసీ లోని సీనియర్ నేతలు అయిన పొన్నం ప్రభాకర్ జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, వీహెచ్.. చివరకు విభేదాలున్న రేవంత్ రెడ్డిని కూడా ఉత్తమ రంగంలోకి దింపగలిగారు. వీరందరి ప్రచారంతో గెలిపించి తన పీసీసీ పదవిని కూడా దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఉత్తమ్ పీసీసీ పదవి కేంద్రంగా జరుగుతున్న హుజూర్ నగర్ ఎన్నికలో పద్మావతి గెలుస్తుందా? టిఆర్ఎస్ గెలుస్తుందా పీసీసీ పదవి ఉత్తమ కు కొనసాగుతుందా అనేది తెలియాలంటే ఈనెల 21న జరిగే ఉప ఎన్నిక వరకూ ఆగాల్సిందేనన్న చర్చ కాంగ్రెస్‌లో సాగుతోంది. ఇక ఉత్తమ్‌కే కాదు.. కాంగ్రెస్‌ పార్టీకి కూడా తెలంగాణలో ఈ ఎన్నిక జీవన్మరణ సమస్యే..ఇప్పటికే నాయకులంతా ఒక్క తాటిపైకి వచ్చారు. మరోవైపు టీఆర్‌ఎస్‌కు ఆర్టీసీ సమ్మెలాంటి నెగటీవ్ పాయింట్స్ కనిపిస్తోన్న సమయంలో కూడా ఓడిపోతే..కార్యకర్తలు మనోధైర్యం కోల్పోయే ప్రమాదం ఉంది.

టీఆర్‌ఎస్ గెలవకపోతే: 

ఉప ఎన్నికలంటే ఆ టెన్షన్ అధికార పార్టీపై మరింతగా ఉంటుంది. పవర్‌లో ఉండడంతో అది ఇజ్జత్ కా సవాల్ గా మారుతుంది. ఇప్పుడు హుజుర్ నగర్ ఉప ఎన్నికలు టీఆర్ఎస్ కు అలాంటి పరిస్థితినే తెచ్చిపెట్టాయి. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీచాయి. అనూహ్యంగా కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోవడం పార్టీ వర్గాలకు, వ్యక్తిగతంగా కేసీఆర్‌కు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఇక ఇప్పుడు కానీ గెలవకపోతే టీఆర్‌ఎస్ పని అయిపోయిందని ప్రతిపక్షాలు ప్రచారం చేయడం ఖాయం. అంతేకాదు రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా ఉన్న కేసీఆర్ ఇమేజ్‌ కూడా కాస్త డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక అటు గౌరవప్రదమైన..ఓట్లు సాధించి తమకు పట్టు ఉందని తెలియజేయడానికి టీడీపీ..తమ సత్తా చూపించడానికి బీజేపీ కూడా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా చూసుకుంటే ప్రతి పార్టీకి ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకమే. ఏదో ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో హుజూర్‌నగర్ ఉపఎన్నిక ప్రభావితం చూపించే అవకాశాలు స్ఫష్టంగా కనిపిస్తున్నాయి.