AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. ఓంకార మంత్రం జపించిన నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు రోజుల గుజరాత్ పర్యటనను శనివారం సోమనాథ్‌లో ప్రారంభించారు. శనివారం సాయంత్రం రాజ్‌కోట్ నుండి హెలికాప్టర్‌లో అక్కడికి చేరుకున్న ఆయన అక్కడ రోడ్ షో నిర్వహించారు. ప్రధానిని చూడటానికి రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. జనవరి 10 నుండి 12 వరకు ప్రధాని మోదీ గుజరాత్‌లో పర్యటిస్తారు.

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. ఓంకార మంత్రం జపించిన నరేంద్ర మోదీ
Pm Modi At Somnath Swabiman Parv,
Balaraju Goud
|

Updated on: Jan 10, 2026 | 9:40 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (జనవరి 10, 2026) గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించార. పురాతన మందిరంలో “సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్” వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ, ఈ సందర్భంగా నిర్వహించిన ఆచారాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.వివిధ నేపథ్య ఆకృతులను ఉపయోగించి పరమశివుడు, శివలింగం సంబంధించి పెద్ద చిత్రాలను రూపొందించిన అద్భుతమైన డ్రోన్ ప్రదర్శనను ప్రధాని మోదీ వీక్షించారు. సోమనాథ్ ఆలయం అద్భుతమైన 3D షో సైతం ప్రదర్శించారు.

ఓంకార మంత్ర జపంలో పాల్గొన్న ప్రధాని మోదీ

శనివారం, ప్రధానమంత్రి సోమేశ్వర్ మహాదేవ్ మహా ఆరతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ ఓంకార్ మంత్రాన్ని జపించారు. ఈ జపం దాదాపు 72 గంటల పాటు కొనసాగింది. సోమనాథ్ ఆలయంలో జరిగిన సామూహిక ఓంకార మంత్ర జపంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జనవరి 8న ప్రారంభమై, ఆదివారం (జనవరి 11, 2025)న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ముగియనుంది. చారిత్రాత్మక సోమనాథ్ ఆలయంపై మొదటి దాడి జరిగి 1,000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ జరుపుకుంటున్నారు. దీని తర్వాత, సోమనాథ్ గాథను ప్రస్తావిస్తూ డ్రోన్ షో నిర్వహించారు. ఈ ప్రదర్శన కోసం మూడు వేల డ్రోన్లను మోహరించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు రోజుల గుజరాత్ పర్యటనను శనివారం సోమనాథ్‌లో ప్రారంభించారు. శనివారం సాయంత్రం రాజ్‌కోట్ నుండి హెలికాప్టర్‌లో అక్కడికి చేరుకున్న ఆయన అక్కడ రోడ్ షో నిర్వహించారు. ప్రధానిని చూడటానికి రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. జనవరి 10 నుండి 12 వరకు ప్రధాని మోదీ గుజరాత్‌లో పర్యటిస్తారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా లో కొన్ని ఫోటోలను పంచుకున్నారు. “మన నాగరికత ధైర్యసాహసాలకు అద్భుతమైన చిహ్నం అయిన సోమనాథ్‌లో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్శన 1026లో సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి 1,000వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశం మొత్తం కలిసి వచ్చిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌తో సమానంగా ఉంది. ప్రజలకు వారి సాదర స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.” అంటూ పేర్కొన్నారు.

జనవరి 11న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమనాథ్‌లోని పవిత్ర జ్యోతిర్లింగ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. తన పర్యటన తర్వాత, ఆయన సోమనాథ్‌లోని శౌర్య యాత్రలో పాల్గొంటారు. సుమారు ఒక కిలోమీటరు పొడవున్న ఈ శౌర్య పర్వ యాత్ర సోమనాథ్ పట్టణంలో జరుగుతుంది. ఇది పెద్ద సంఖ్యలో జనసమూహాలను ఆకర్షిస్తుంది. దేశభక్తి, సాంస్కృతిక ఉత్సాహభరితమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. సోమనాథ్ కార్యక్రమం తర్వాత, ప్రధానమంత్రి మోదీ రాజ్‌కోట్‌కు వెళతారు. అక్కడ ఆయన ప్రాంతీయ చైతన్య శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఈ శిఖరాగ్ర సమావేశం పరిశ్రమ, పెట్టుబడి, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై దృష్టి పెడుతుంది.

ఆ తర్వాత జనవరి 12న ప్రధానమంత్రి మోదీ జర్మన్ ఛాన్సలర్‌తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, సహకారం, వివిధ అంశాలపై చర్చించనున్నారు. ప్రధాని మోదీ – ఛాన్సలర్ మెర్జ్ వ్యాపార, పరిశ్రమ నాయకులతో కూడా సమావేశమై ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకుంటారని సమాచారం. ఆ తర్వాత రెండు దేశాల నాయకులు సంయుక్తంగా అహ్మదాబాద్ నదీతీరంలో అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇది భారతదేశ సంస్కృతి, ప్రపంచ స్నేహాన్ని ప్రదర్శిస్తుంది.

ఆ తర్వాత ఇద్దరు నాయకులు అహ్మదాబాద్‌లోని సబర్మతి నది ఒడ్డున జరిగే గాలిపటాల ఉత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత వారు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. సబర్మతి ఆశ్రమం తర్వాత, ప్రధాని మోదీ అహ్మదాబాద్ పాత హైకోర్టు స్టేషన్ నుండి గాంధీనగర్ మహాత్మా మందిర్ వరకు మెట్రోలో ప్రయాణించి, సచివాలయం నుండి మహాత్మా మందిర్ వరకు కొత్తగా నిర్మించిన మెట్రో విభాగాన్ని ప్రారంభిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..