వైసీపీ అధికార ప్రతినిధులు ఎంతమంది? వారి పేర్లేంటి..? పుల్ డిటేల్స్..!

వైసీపీ అధికార ప్రతినిధులు ఎంతమంది? వారి పేర్లేంటి..? పుల్ డిటేల్స్..!

రాష్ట్ర, జాతీయ వ్యవహారాలపై ప్రకటనలు జారీ చేసేందుకు, టీవీ చర్చల్లో పాల్గొనేందుకు  అధికార ప్రతినిధులను వైసీపీ ప్రకటించింది. మొత్తం 30 మంది నేతలతో కూడిన జాబితాను విడుదల చేసింది. గతంలో అధికార ప్రతినిధులను ప్రకటించినప్పటికీ ఆ జాబితాను సవరిస్తూ తాజాగా 30 మందితో కూడిన జాబితాను వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. సీనియర్‌ నేతలతో పాటు ఇటీవల ఎన్నికైన శాసనసభ్యులను కూడా అధికార ప్రతినిధుల జాబితాలో చేర్చారు. ఈ మేరకు పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి […]

Ram Naramaneni

|

Oct 20, 2019 | 5:41 AM

రాష్ట్ర, జాతీయ వ్యవహారాలపై ప్రకటనలు జారీ చేసేందుకు, టీవీ చర్చల్లో పాల్గొనేందుకు  అధికార ప్రతినిధులను వైసీపీ ప్రకటించింది. మొత్తం 30 మంది నేతలతో కూడిన జాబితాను విడుదల చేసింది. గతంలో అధికార ప్రతినిధులను ప్రకటించినప్పటికీ ఆ జాబితాను సవరిస్తూ తాజాగా 30 మందితో కూడిన జాబితాను వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. సీనియర్‌ నేతలతో పాటు ఇటీవల ఎన్నికైన శాసనసభ్యులను కూడా అధికార ప్రతినిధుల జాబితాలో చేర్చారు. ఈ మేరకు పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి పేరిట ఈ ప్రకటన జారీ చేశారు.

జాబితాలో 20 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వర్గాలకు స్థానం కల్పించారు. పార్టీ పదవుల్లో కూడా జగన్ సామాజిక న్యాయం పాటించారని సంకేతాల ఇచ్చే దిశగా ఈ జాబితా ఉంది.

అధికార ప్రతినిధులు వీరే..

1. ఉండవల్లి శ్రీదేవి 2. ధర్మాన ప్రసాదరావు 3. ఆనం రామనారాయణరెడ్డి 4. కె.పార్థసారధి 5. అంబటి రాంబాబు 6. జోగి రమేష్‌ 7. మల్లాది విష్ణు 8. భూమన కరుణాకర్‌రెడ్డి 9. కాకాని గోవర్ధన్‌రెడ్డి 10. గుడివాడ అమర్‌నాథ్‌ 11. మహమ్మద్‌ ఇక్బాల్‌ 12. గడికోట శ్రీకాంత్ రెడ్డి 13. విడదల రజని 14. మేరుగ నాగార్జున 15. తెల్లం బాలరాజు 16. రాజన్న దొర 17. అదీప్‌ రాజ్‌ 18. అబ్బయ్య చౌదరి 19. నారమల్లి పద్మజ 20. సిదిరి అప్పలరాజు 21. కిలారు రోశయ్య 22. జక్కంపూడి రాజా 23. బత్తుల బ్రహ్మానందరెడ్డి 24. కాకమాను రాజశేఖర్‌ 25. అంకంరెడ్డి నారాయణమూర్తి 26. నాగార్జున యాదవ్‌ 27. రాజీవ్‌ గాంధీ 28. కె.రవి చంద్రారెడ్డి 29. ఈద రాజశేఖర్‌రెడ్డి 30. పి.శివశంకర్‌రెడ్డి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu