చందనది పరువు హత్యే..అమ్మానాన్నలే కడతేర్చారు..!

చిత్తూరు జిల్లా శాంతిపురం మండల పరిధిలోని రెడ్లపల్లెలో ఈ నెల 12న జరిగిన చందన(17) మృతిని పోలీసులు హత్యగా తేల్చారు. చందనను తన తల్లీతండ్రులే హత్యచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పలమనేరు డీఎస్పీ అరీపుల్లా ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. దళిత యువకుడ్ని ప్రేమించిందన్న కారణంగానే కూతుర్ని కిరాతకంగా చంపి.. కాల్చి బూడిద చేసినట్లు గుర్తించారు. బాలిక తల్లిదండ్రులతో పాటూ ఈ హత్యతో సంబంధం ఉన్న మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు […]

చందనది పరువు హత్యే..అమ్మానాన్నలే కడతేర్చారు..!
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 20, 2019 | 7:22 AM

చిత్తూరు జిల్లా శాంతిపురం మండల పరిధిలోని రెడ్లపల్లెలో ఈ నెల 12న జరిగిన చందన(17) మృతిని పోలీసులు హత్యగా తేల్చారు. చందనను తన తల్లీతండ్రులే హత్యచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పలమనేరు డీఎస్పీ అరీపుల్లా ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. దళిత యువకుడ్ని ప్రేమించిందన్న కారణంగానే కూతుర్ని కిరాతకంగా చంపి.. కాల్చి బూడిద చేసినట్లు గుర్తించారు. బాలిక తల్లిదండ్రులతో పాటూ ఈ హత్యతో సంబంధం ఉన్న మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

జిల్లాలోని శాంతిపురం మండలం రెడ్లపల్లెలో నివసిస్తున్న వెంకటేష్‌, అమరావతి దంపతులకు చందన రెండో కుమార్తె. కుప్పంలోని ప్రభుత్వ కళాశాలలో చందన డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే మండలం ఒడ్డుమడి గ్రామానికి చెందిన యువకుడితో చందనకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నెల 12న వారిద్దరు కుప్పంలోని దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్నట్లు తెలుసుకున్న చందన కుటుంబసభ్యులు ఆమెను దేవాలయంలో పెళ్లిపీటల నుంచి ఇంటికి తీసుకొచ్చారు. అదే రోజు సాయంత్రం ఈ విషయంలో చందనకు, ఆమె తండ్రికి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ తారస్థాయికి చేరడంతో తండ్రి వెంటేష్ తాడు సాయంతో గొంతు నులిమి హతమార్చాడు. ఆ తర్వాత హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇంట్లోని దూలానికి వేలాడదీశాడు.

పెళ్లైన మరుసటి రోజే చందన ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు గ్రామంలో అందరికి చెప్పారు. వెంటనే మృతదేహాన్ని దహనం చేశారు. చందన ఆత్మహత్య వెనుక కుట్ర ఉందని నందకుమార్ బంధువులు ఆరోపించారు. ఆమెను కుటుంబ సభ్యులే చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మరణంగా భావించారు.. అలాగే కేసు నమోదు చేసి బాలిక తల్లిదండ్రులు, బంధువుల్ని ప్రశ్నించారు. చివరికి తల్లిదండ్రులే కూతుర్ని చంపినట్లు తేల్చారు. కన్నబిడ్డని కనీసం కనికరంగా లేకుండా చందనను చంపిన తల్లిదండ్రుల్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.