వల్లభనేని వంశీపై ఫోర్జరీ కేసు..టీడీపీ గరంగరం..!
కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేశారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బాపులపాడు తహసీల్దార్ వంశీపై ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని బాపులపాడు మండలంలో పేదలకు నకిలీ పట్టాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ పోలీసులు ఆయనపై కేసు పెట్టారు. అయితే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ దొంగ కేసు పెట్టారని వంశీ ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే… గత […]
కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేశారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బాపులపాడు తహసీల్దార్ వంశీపై ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని బాపులపాడు మండలంలో పేదలకు నకిలీ పట్టాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ పోలీసులు ఆయనపై కేసు పెట్టారు. అయితే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ దొంగ కేసు పెట్టారని వంశీ ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే… గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం నియోజకవర్గంలోని పెరికీడు, కొయ్యూరు తదితర గ్రామాల పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు. గ్రామాల వారీగా జన్మభూమి గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారుల పేర్లను సంబంధిత మండల రెవెన్యూ అధికారులు చదివి వినిపించారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి కొద్దిరోజుల ముందు భారీ సభ ఏర్పాటుచేసి లక్ష పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు అధికారులు నకిలీవని పేర్కొంటున్న పట్టాదారుల పేర్లను కూడా అప్పట్లో తహసీల్దార్ జన్మభూమి గ్రామసభల్లో చదివి వినిపించారని, అలాంటప్పుడు లబ్ధిదారుల అసలు పట్టాలేమయ్యాయని వంశీ ప్ర శ్నించారు. పైగా వారికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, వారంతా అప్పటికే ఉంటున్న స్థలాలకు సంబంధించి పొజిషన్ సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారని చెబుతున్నారు. పట్టాల్లో సంతకాలు ఫోర్జరీ చేశారని తహసీల్దార్ ఎలా నిర్ధారిస్తారన్నారు. ఫోరెన్సిక్ పరీక్షలకు పంపకుండా దొంగకేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని విమర్శించారు.