‘దటీజ్ గంభీర్’..పాక్ చిన్నారి ప్రాణానికి అభయం..!
మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ మరోసారి సెల్యూట్ చేసే సమయం వచ్చింది. దూకుడుతనం మాత్రమే కాదు మానవత్వం కూడా గంభీర్ బ్లడ్ల్‌లో ఇన్ బుల్ట్ ఉంది. ఇప్పుటికే ఆ కోణాన్ని ఎన్నోసార్లు చాటుకున్నాడు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ 6 ఏళ్ల చిన్నారి శస్త్రచికిత్స కోసం భారత్ రావడానికి చొరవ తీసుకుని వీసా వచ్చేలా చేశారు. పాక్‌కు చెందిన ఉమామియా అలీ అనే చిన్నారి గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆ చిన్నారి […]
మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ మరోసారి సెల్యూట్ చేసే సమయం వచ్చింది. దూకుడుతనం మాత్రమే కాదు మానవత్వం కూడా గంభీర్ బ్లడ్ల్‌లో ఇన్ బుల్ట్ ఉంది. ఇప్పుటికే ఆ కోణాన్ని ఎన్నోసార్లు చాటుకున్నాడు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ 6 ఏళ్ల చిన్నారి శస్త్రచికిత్స కోసం భారత్ రావడానికి చొరవ తీసుకుని వీసా వచ్చేలా చేశారు. పాక్‌కు చెందిన ఉమామియా అలీ అనే చిన్నారి గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆ చిన్నారి కుటుంబం చికిత్స కోసం భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం పాక్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్.. గంభీర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. దీనిపై ఆయన చొరవ తీసుకుని ఆ చిన్నారి, ఆమె తల్లిదండ్రులు భారత్ వచ్చేలా వీసా ఇవ్వాలని కోరుతూ విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరారు. ఈ విన్నపంపై మంత్రి కూడా స్పందించారు.
ఆ ముగ్గురికి వీసాలు జారీ చేయాలని ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌కు సూచించారు. ఆ తర్వాత వారికి వీసాలు జారీ చేసినట్లుగా గంభీర్‌కు లేఖ రాశారు. దీంతో గంభీర్ ఆ లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
उस पार से एक नन्हे दिल ने दस्तक दी, इस पार दिल ने सब सरहदें मिटा दी।
उन नन्हे कदमों के साथ बहती हुई मीठी हवा भी आई है, कभी-कभी ऐसा भी लगता है जैसे बेटी घर आई है।
Thank u @DrSJaishankar 4 granting visa to Pakistani girl& her parents for her heart surgery @narendramodi @AmitShah pic.twitter.com/zuquO2hnMv
— Gautam Gambhir (@GautamGambhir) October 19, 2019
‘అవతలి వైపు నుంచి ఓ పసి హృదయం మనల్ని సంప్రదించినప్పుడు అది మన కట్టుబాట్లు, హద్దులు పక్కన పెట్టేలా చేస్తుంది. తన చిన్ని పాదాలతో ఆ చిన్నారి మనకు తియ్యటి గాలిని తెస్తోంది. ఇది ఒక బిడ్డ తన పుట్టింటిని సందర్శించినట్లు ఉంది’ అని పేర్కొన్నారు. ఒక దేశం మొత్తాన్ని ద్వేశించడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. పాకిస్థాన్‌లో నుండి ఇండియాను అభిమానించేవారు ఉంటారు. ఇండియాలో ఉంటూ పాకిస్థాన్ బాగుండాలని కోరుకునేవారు లేకపోరు. తారతమ్యాలు మరిచి ప్రతి మనిషి బాగుండాలని కోరుకుంటే ఈ ప్రపంచమే అద్బుతంగా ఉంటుంది. ఎనీ వే హ్యాట్సాప్ గంభీర్.