వంటలక్క ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ముగిసిన “కార్తికదీపం” సీరియల్..!

వంటలక్క ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ముగిసిన కార్తికదీపం సీరియల్..!

సీరియల్స్ అంటే మహిళలలే, కాదు ఇప్పుడు పురుషులు కూడా చెవులు కోసుకుంటున్నారు. తెలుగులో అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్స్‌లో కార్తీక దీపం టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ సీరియల్‌లో దీప క్యారెక్టర్ చాలా ప్రత్యేకం. ఆమె క్యారెక్టర్ కోసమే చాలామంది మహిళలు ఈ సీరియల్ చూస్తున్నారు అని చెప్పొచ్చు. రేపటి ఎపిసోడ్ కోసం ముందురోజు నుంచే అతృతగా ఎదురు చూసేలా చేస్తుంది అంటే ఈ సీరియల్‌ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కార్మీక్, దీప దాంపత్య […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 20, 2019 | 8:34 AM

సీరియల్స్ అంటే మహిళలలే, కాదు ఇప్పుడు పురుషులు కూడా చెవులు కోసుకుంటున్నారు. తెలుగులో అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్స్‌లో కార్తీక దీపం టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ సీరియల్‌లో దీప క్యారెక్టర్ చాలా ప్రత్యేకం. ఆమె క్యారెక్టర్ కోసమే చాలామంది మహిళలు ఈ సీరియల్ చూస్తున్నారు అని చెప్పొచ్చు. రేపటి ఎపిసోడ్ కోసం ముందురోజు నుంచే అతృతగా ఎదురు చూసేలా చేస్తుంది అంటే ఈ సీరియల్‌ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కార్మీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో మూడేళ్లు పూర్తిచేసుకుంది. విశేషమైన ప్రేక్షాకాదరణ పొందిన కార్తీక దీపం మాతృక మళయాళంలోని కారుముత్తు నుంచి తీసుకొని తెలుగులో రీమేక్ చేశారు. అయితే దీపగా, వంటలక్కగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రేమి విశ్వనాథ్, ప్రతీ మహిళను కదిలించేలా నటించింది. అయితే ఈ సీరియల్ ప్రస్తుతం ముగిసిందనే వార్తలు వస్తున్నాయి. దీంతో సీరియల్ అభిమానులు ఏం జరిగిందా అనే ఆందోళనలో ఉన్నారు. కానీ కార్తీక దీపం తెలుగులో ముగియలేదని, మళయాల మాతృక కారుముత్తు మాత్రం ముగిసిపోయిందని తెలుస్తోంది. ఇప్పటికే గత ఏడు సంవత్సరాలుగా అలరించిన కారుముత్తు (కార్తీకదీపం) ముగిసింది.

అయితే తెలుగు కార్తీక దీపం సీరియల్‌కి, మళయాళ కారుముత్తుకి మధ్య కథలో కాస్త మార్పులు ఉన్నప్పటికీ రెండు సీరియల్స్ మూల కథ ఒక్కటే.. మళయాళంలో కార్తీక్, దీపలు విడిపోవడం, దీప గతం మర్చిపోయి..వేరే వ్యక్తిని ప్రేమించడం, కార్తీక్ క్యాన్సర్ వ్యాధితో కెనడా వెళ్లిపోవడం, చివరకు గతం గుర్తుకువచ్చిన దీప తిరిగి కార్తీక్‌ను వెతుక్కుంటూ అత్తగారు సౌందర్య ఇంటికి రావడం, చివరకు కార్తీక్, దీప కలవడంతో సీరియల్ ముగిసింది. అయితే తెలుగులో ఇప్పటికే మూడు సంవత్సరాల సీరియల్ పూర్తి అయినప్పటికీ, మళయాళం కథనం ప్రకారం సీరియల్ పూర్తి కావాలంటే ఇంకా నాలుగు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. వంటలక్క ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పనిలేదు. కథ ఇంకా ముగిసిపోలేదు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu