AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్@9AM

1. ఆగని ఆర్టీసీ సమ్మె.. నెక్ట్సేంటి..? తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 16వ రోజుకి చేరుకుంది. హైకోర్టు ఆదేశాల్ని కూడా ప్రభుత్వం పక్కన పెట్టడంతో.. ఆర్టీసీ జేఏసీ సీఎం తీరుపై మండిపడుతోంది. ప్రభుత్వం వెనక్కు తగ్గి చర్చలకు రాకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని.. Read more 2. బీ కేర్‌ఫుల్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అనేకచోట్ల భారీ […]

టాప్ 10 న్యూస్@9AM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 20, 2019 | 9:00 AM

Share

1. ఆగని ఆర్టీసీ సమ్మె.. నెక్ట్సేంటి..?

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 16వ రోజుకి చేరుకుంది. హైకోర్టు ఆదేశాల్ని కూడా ప్రభుత్వం పక్కన పెట్టడంతో.. ఆర్టీసీ జేఏసీ సీఎం తీరుపై మండిపడుతోంది. ప్రభుత్వం వెనక్కు తగ్గి చర్చలకు రాకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని.. Read more

2. బీ కేర్‌ఫుల్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అనేకచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో శనివారం కురిసిన భారీ వర్షాలకు జనం తడిసిముద్దైపోయారు. రాష్ట్ర.. Read more

3. నగరంలో రద్దీ తగ్గేలా చూడండి.. మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ నగరంలో రోడ్లపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో గల రోడ్లు, నెట్‌వర్క్‌లను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్. విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్‌పై దృష్టి.. Read more

4. వల్లభనేని వంశీపై ఫోర్జరీ కేసు..టీడీపీ గరంగరం..!

కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై  హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేశారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బాపులపాడు తహసీల్దార్‌.. Read more

5. వైసీపీ అధికార ప్రతినిధులు ఎంతమంది? వారి పేర్లేంటి..? పుల్ డిటేల్స్..!

రాష్ట్ర, జాతీయ వ్యవహారాలపై ప్రకటనలు జారీ చేసేందుకు, టీవీ చర్చల్లో పాల్గొనేందుకు  అధికార ప్రతినిధులను వైసీపీ ప్రకటించింది. మొత్తం 30 మంది నేతలతో కూడిన జాబితాను విడుదల చేసింది. గతంలో అధికార ప్రతినిధులను ప్రకటించినప్పటికీ.. Read more 

6. చందనది పరువు హత్యే..అమ్మానాన్నలే కడతేర్చారు..!

చిత్తూరు జిల్లా శాంతిపురం మండల పరిధిలోని రెడ్లపల్లెలో ఈ నెల 12న జరిగిన చందన(17) మృతిని పోలీసులు హత్యగా తేల్చారు. చందనను తన తల్లీతండ్రులే హత్యచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పలమనేరు డీఎస్పీ.. Read more

7.వంటలక్క ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ముగిసిన “కార్తికదీపం” సీరియల్..!

సీరియల్స్ అంటే మహిళలలే, కాదు ఇప్పుడు పురుషులు కూడా చెవులు కోసుకుంటున్నారు. తెలుగులో అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్స్‌లో కార్తీక దీపం టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ సీరియల్‌లో దీప క్యారెక్టర్ చాలా ప్రత్యేకం. ఆమె క్యారెక్టర్ కోసమే చాలామంది.. Read more 

8. బాలీవుడ్‌ సెలబ్రిటీస్‌‌తో మోదీ భేటీ..ఎందుకంటే?

మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ శనివారం బాలీవుడ్‌ సెలబ్రిటీస్‌ను కలిశారు. ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్‌, షారూక్‌ ఖాన్‌, కంగనా రనౌత్ సహా..Read more

9. ‘దటీజ్ గంభీర్’..పాక్ చిన్నారి ప్రాణానికి అభయం..!

మాజీ క్రికెటర్‌, ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి సెల్యూట్ చేసే సమయం వచ్చింది. దూకుడుతనం మాత్రమే కాదు  మానవత్వం కూడా గంభీర్ బ్లడ్ల్‌లో ఇన్ బుల్ట్ ఉంది. ఇప్పుటికే  ఆ కోణాన్ని ఎన్నోసార్లు చాటుకున్నాడు.  తాజాగా పాకిస్థాన్‌కు చెందిన.. Read more 

10. ప్రొ కబడ్డీ లీగ్‌ విజేత బెంగాల్‌..ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

తుదిపోరులో దబాంగ్‌ ఢిల్లీని మట్టికరిపించి ప్రొ కబడ్డీ టైటిల్‌ను బెంగాల్ వారియర్స్‌ తొలిసారిగా ముద్దాడింది. తొలి 6 నిమిషాల ఆటను చూస్తే దబంగ్‌ ఢిల్లీదే టైటిల్‌ అనుకున్నారు. అయితే అద్భుతమైన ఆటతీరుతో పుంజుకున్న బెంగాల్‌ వారియర్స్‌ సీజన్‌లో.. Read more