Breaking News
  • విశాఖ: బ్లూఫ్రాగ్‌ టెక్నాలజీస్‌పై కొనసాగుతున్న సీఐడీ విచారణ. 8 సర్వర్లకు చెందిన డేటాను సేకరించిన అధికారులు. డేటాను విశ్లేషిస్తున్న సీఐడీ అధికారులు. ప్రభుత్వ ఇసుక పోర్టల్‌ను హ్యాక్‌ చేసి.. కృత్రిమ కొరత సృష్టించినట్టు బ్లూఫ్రాగ్‌పై అభియోగాలు.
  • హైదరాబాద్‌: అధికారులతో రైల్వే సేఫ్టీ కమిషనర్‌ భేటీ. కాచిగూడ రైలు ప్రమాదంపై చర్చ. ప్రకాశం జిల్లా: ఒంగోలులో మనబడి నాడు-నేడు కార్యక్రమం ప్రారంభం. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన జగన్‌.
  • ప.గో: యలమంచిలి మండలం కాజ గ్రామంలో రోడ్డుప్రమాదం. అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు. దంపతులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కల్యాణదుర్గంలో కాలువలోకి దూసుకెళ్లిన కాలేజ్‌ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది విద్యార్థులు. విద్యార్థులకు తృటిలో తప్పిన ముప్పు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు.
  • భూపాలపల్లిలో కొనసాగుతున్న బంద్‌. ఆర్టీసీ డ్రైవర్‌ నరేష్‌ ఆత్మహత్యకు నిరసనగా బంద్‌. డిపోల్లోనే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు.
  • అమరావతి: మంగళగిరి జనసేన కార్యాలయంలో బాలల దినోత్సవం. పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌. పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేసిన పవన్‌కల్యాణ్‌.
  • హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్‌. కూకట్‌పల్లిలో ఇండోర్‌ స్టేడియం ప్రారంభం. మల్టీపర్పస్‌ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను.. పిల్లలతో కలిసి ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌. డబుల్ బెడ్‌రూమ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కేటీఆర్. అధికారిక కార్యక్రమాల్లో ఫ్లెక్సీలపై కేటీఆర్‌ వార్నింగ్‌. ఫ్లెక్సీలు తొలగిస్తేనే కార్యక్రమానికి వస్తానన్న కేటీఆర్‌. కేటీఆర్‌ ఫ్లెక్సీలు తొలగించిన సిబ్బంది.

‘దటీజ్ గంభీర్’..పాక్ చిన్నారి ప్రాణానికి అభయం..!

మాజీ క్రికెటర్‌, ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి సెల్యూట్ చేసే సమయం వచ్చింది. దూకుడుతనం మాత్రమే కాదు  మానవత్వం కూడా గంభీర్ బ్లడ్ల్‌లో ఇన్ బుల్ట్ ఉంది. ఇప్పుటికే  ఆ కోణాన్ని ఎన్నోసార్లు చాటుకున్నాడు.  తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ 6 ఏళ్ల చిన్నారి శస్త్రచికిత్స కోసం భారత్‌ రావడానికి చొరవ తీసుకుని వీసా వచ్చేలా చేశారు. పాక్‌కు చెందిన ఉమామియా అలీ అనే చిన్నారి గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆ చిన్నారి కుటుంబం చికిత్స కోసం భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం పాక్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్.. గంభీర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. దీనిపై ఆయన చొరవ తీసుకుని ఆ చిన్నారి, ఆమె తల్లిదండ్రులు భారత్‌ వచ్చేలా వీసా ఇవ్వాలని కోరుతూ విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరారు. ఈ విన్నపంపై మంత్రి కూడా స్పందించారు.

ఆ ముగ్గురికి వీసాలు జారీ చేయాలని ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌కు సూచించారు. ఆ తర్వాత వారికి వీసాలు జారీ చేసినట్లుగా గంభీర్‌కు లేఖ రాశారు. దీంతో గంభీర్‌ ఆ లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘అవతలి వైపు నుంచి ఓ పసి హృదయం మనల్ని సంప్రదించినప్పుడు అది మన కట్టుబాట్లు, హద్దులు పక్కన పెట్టేలా చేస్తుంది. తన  చిన్ని పాదాలతో ఆ చిన్నారి మనకు తియ్యటి గాలిని తెస్తోంది. ఇది ఒక బిడ్డ తన పుట్టింటిని సందర్శించినట్లు ఉంది’ అని పేర్కొన్నారు. ఒక దేశం మొత్తాన్ని ద్వేశించడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. పాకిస్థాన్‌లో నుండి ఇండియాను అభిమానించేవారు ఉంటారు. ఇండియాలో ఉంటూ పాకిస్థాన్ బాగుండాలని కోరుకునేవారు లేకపోరు. తారతమ్యాలు మరిచి ప్రతి మనిషి బాగుండాలని కోరుకుంటే ఈ ప్రపంచమే అద్బుతంగా ఉంటుంది. ఎనీ వే హ్యాట్సాప్ గంభీర్.