ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తలపడనున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు అధినేతలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బైడెన్ తీవ్రంగా ఖండించారు.
నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తలపడనున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు అధినేతలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బైడెన్ తీవ్రంగా ఖండించారు. అగ్రరాజ్యంగా అమెరికా లేకపోతే మరి ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు. ట్రంప్ కోరుకున్నట్లే అమెరికా ప్రపంచ వేదికపై నుంచి తప్పుకుంటే ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తారు అని ఆయన ప్రశ్నించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్లోరిడాలో మాట్లాడిన జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలోని టంపాలోని హిల్స్‌బరో కమ్యూనిటీ కాలేజీలో మంగళవారం జరిగిన ప్రచార కార్యక్రమంలో అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తన గెలుపును కోరుకుంటున్నాయని బైడెన్ చెప్పారు. జీ7, జీ20 వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాధినేతలు మీరే గెలవాలని తనతో చెప్పారని పేర్కొన్నారు. యావత్ ప్రపంచం అమెరికావైపే చూస్తోందని అన్నారు. ఎవరు గెలుస్తారనే అంశం కంటే, ఈ ఎన్నికలు ఎలా జరగనున్నాయనే దానిపైనే అందరూ దృష్టి సారించారని బైడెన్ చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ??
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్ పైకి !!