ANIL KUMAR POKA

చిట్టి టాటూ వెనక ఇంత కథ ఉందా.! ఫరియా క్లారిటీ అదుర్స్.

26 April 2024

జాతిరత్నాలు చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా.. టాలెస్ట్ హీరోయిన్ గా ఈ పేరు సౌత్ లో బాగా ఫెమౌస్ అనే చెప్పాలి.

ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మాడి.. అతితక్కువ టైంలోనే తెలుగు అడియన్స్ కు చాల దగ్గరైయ్యారు.

హీరోయిన్ కాకముందు థియేటర్ ఆర్టిస్ట్ గా, మోడల్ గా పనిచేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫెమౌస్.

తాజాగా అల్లరి నరేష్ జోడిగా ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె కాలిపై ఉన్న టాటూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దానిపై చిట్టి క్లారిటీ ఇచ్చింది.

అది రూట్స్ టాటూ అని.. ప్రతి ఒక్కరికీ కెరీర్ లో పునాది అనేది చాలా అవసరమని.. అది స్ట్రాంగ్ గా ఉండాలని..

ఉన్నత స్థానాలకు ఎదగాలంటే మన రూట్స్ ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలమని.. ఇది అందరికి వర్తిస్తుందని..

ప్రత్యేకించి పబ్లిక్ లైఫ్ లో గడిపే వాళ్ళు ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయమని నవ్వుతూ తెలిపింది ఫరియా.