- Telugu News Photo Gallery Cinema photos Kriti Sanon responds on Actresses Height in Film Industry Telugu Heroines Photos
Kriti Sanon: దీపిక, అనుష్క కి అదే ప్లస్ అయిందా.? కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.
సినిమా ఇండస్ట్రీలో చిన్న మాటైనా కొన్నిసార్లు వైల్డ్ ఫైర్‌లాగా అల్లుకుపోతుంది.. రీసెంట్‌గా కృతిసనన్ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ గురించి కూడా జనాలు అంతే ఈగర్‌గా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలో అంత విషయం ఉందా? ఇంతకీ ఈ విషయం తోటి హీరోయిన్లకు రీచ్ అయిందా? కాలేదా? హీరోయిన్లు ఎత్తుగా ఉండాలా? పొట్టిగా ఉండాలా? ఎలా ఉంటే అవకాశాలు తొందరగా వస్తాయి?
Updated on: Apr 26, 2024 | 12:02 PM

సినిమా ఇండస్ట్రీలో చిన్న మాటైనా కొన్నిసార్లు వైల్డ్ ఫైర్‌లాగా అల్లుకుపోతుంది.. రీసెంట్‌గా కృతిసనన్ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ గురించి కూడా జనాలు అంతే ఈగర్‌గా మాట్లాడుకుంటున్నారు.

ఆ మాటలో అంత విషయం ఉందా? ఇంతకీ ఈ విషయం తోటి హీరోయిన్లకు రీచ్ అయిందా? కాలేదా? హీరోయిన్లు ఎత్తుగా ఉండాలా? పొట్టిగా ఉండాలా? ఎలా ఉంటే అవకాశాలు తొందరగా వస్తాయి?

ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదో కొత్తరకం డిస్కషన్ మొదలైంది. హైట్ తనకు ఎప్పుడూ నెగటివ్ కాలేదని ఓపెన్‌గానే చెప్పేశారు సిల్వర్‌స్క్రీన్ మిమి కృతిసనన్.

దీపిక పదుకోన్‌లాంటి వాళ్లకు హైటే ప్లస్ అయిందని అన్నారు. సినిమాలన్నీ ప్యాన్ ఇండియా మార్కెట్ వైపు పరుగులు తీస్తున్న ఈ టైమ్‌లో హైట్ గురించి డిస్కషన్ గట్టిగానే జరుగుతోంది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో కనిపించని వ్యక్తుల పేర్లు ఉన్నట్టుండి ట్రెండింగ్‌లోకి వచ్చేస్తే, అకేషన్ ఏంటా అని అందరూ ఆరా తీస్తారు. ఇప్పుడు అలా అందరూ అనుష్క శెట్టి గురించి మాట్లాడుకుంటున్నారు.

తెలుగులో టాప్ చెయిర్‌కి వెళ్లిన పూజా హెగ్డేకి కూడా హైట్ కిర్రాక్‌గా కలిసొచ్చింది. అలాగని ఎత్తు తక్కువగా ఉన్న ఆలియా, రష్మికలాంటి వాళ్లు వెయ్యి కోట్ల వైపు దూసుకుపోయిన సినిమాలు చేయలేదా అనేవారు లేకపోలేదు.

నటిగా ప్రూవ్ చేసుకోవాలే గానీ, పొట్టీ, పొడవూ లాంటి విషయాలను సినీ ప్రియులు ఎప్పుడూ పట్టించుకోరన్నది అందరూ యాక్సెప్ట్ చేస్తున్న విషయం




