Anti-Israel Protest: ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. అమెరికాలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌!

అమెరికాలోని ప్రతిష్టాత్మక ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో చదువుతున్న భారత సంతతి విద్యార్ధిని అక్కడి స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా.. పాల‌స్తీనా అనుకూల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్న ఇద్దరు విద్యార్ధులను అరెస్ట్‌ చేశారు. వారిలో ఒకరు భార‌తీయ విద్యార్థిని అచింత్య శివ‌లింగ‌న్‌ ఉన్నట్లు ప్రిన్స్‌టన్ అలుమ్ని వీక్లీ (PAW)వెల్లడించింది. నిరసనలో పాల్గొన్నవ‌ర్సిటీకి చెందిన ఇద్ద‌రు విద్యార్థుల్ని పోలీసులు..

Anti-Israel Protest: ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. అమెరికాలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌!
Anti Israel Protest In US
Follow us

|

Updated on: Apr 26, 2024 | 11:37 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: అమెరికాలోని ప్రతిష్టాత్మక ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో చదువుతున్న భారత సంతతి విద్యార్ధిని అక్కడి స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా.. పాల‌స్తీనా అనుకూల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్న ఇద్దరు విద్యార్ధులను అరెస్ట్‌ చేశారు. వారిలో ఒకరు భార‌తీయ విద్యార్థిని అచింత్య శివ‌లింగ‌న్‌ ఉన్నట్లు ప్రిన్స్‌టన్ అలుమ్ని వీక్లీ (PAW)వెల్లడించింది. నిరసనలో పాల్గొన్నవ‌ర్సిటీకి చెందిన ఇద్ద‌రు విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార‌తీయ విద్యార్థిని అచింత్యతో పాటు హ‌స‌న్ స‌య్య‌ద్‌ ఉన్నాట్లు స్థానిక వ్యార్తా పత్రిక వెల్లడించింది. గురువారం తెల్లవారుజామున యూనివర్సిటీ క్యాంప‌స్‌లో టెంట్లు వేసేందుకు నిర‌స‌న‌కారులు ప్ర‌య‌త్నించారు. వ‌ర్సిటీ నియ‌మావ‌ళిని ఉల్లంఘించినందున ఇద్ద‌రు గ్రాడ్యుయేట్ విద్యార్థుల‌ను అరెస్టు చేయడమేకాకుండా, వాళ్ల‌ను క్యాంప‌స్‌ నుంచి డిబార్ చేసిన‌ట్లు వ‌ర్సిటీ ప్ర‌తినిధి జెన్నిఫ‌ర్ మోరిల్ తెలిపారు. ఈ మేరకు వారిపై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకున్నట్లు తెలిపారు.

టెంట్లు వేయ‌వ‌ద్దని ఎన్ని సార్లు హెచ్చరించినా ఆ విద్యార్థులు ప‌ట్టించుకోలేద‌ని, దాంతో వాళ్ల‌ను అరెస్టు చేయాల్సి వ‌చ్చిన‌ట్లు వ‌ర్సిటీ అధికారులు తెలిపారు. అరెస్ట్‌ అయిన భారత సంతతి విద్యార్ధిని అచింత్య శివలింగన్ స్వస్థలం తమిళనాడు. ఆమె ప్రిన్స్‌టన్‌లో ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్‌లో పబ్లిక్ అఫైర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. ఇక మరొక విద్యార్ధి సయ్యద్ అక్కడ పీహెచ్‌డీ చదువుతున్నాడు.

ఇజ్రాయిల్ మిలిట‌రీ చ‌ర్య‌ల వ‌ల్ల గాజాలో జ‌రుగుతున్న వేలాది మంది చనిపోతున్నారు. ఈ మార‌ణ‌హోమానికి వ్య‌తిరేకంగా వేల సంఖ్య‌లో విద్యార్థులతోపాటు అధ్యాపకులు, అమెరికా పౌరులు పలు యూనివర్సిటీల్లో ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. తెల్లటి టెంట్లు ఏర్పాటు చేసి నిరసనలు చేపట్టసాగారు.

న్యూయార్క్‌లోని కొలంబియా వ‌ర్సిటీలో కూడా పెద్ద ఎత్తు ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. దీంతో అమెరికాలోని టాప్ వ‌ర్సిటీల్లో వందలాది మంది విద్యార్ధులు పాలస్తీనా అనుకూల నినాదాలు చేస్తున్నారు. గాజా యుద్ధంతో లాభపడే కంపెనీల నుంచి వైదొలగాలని, తక్షణ కాల్పులను విరమించుకోవాలని పిలుపునిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?