Telangana: కూల్ న్యూస్.. తెలంగాణకు వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..

మండే ఎండలకు కాస్త బ్రేక్ పడనుంది. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంది.

Telangana: కూల్ న్యూస్.. తెలంగాణకు వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..

|

Updated on: May 06, 2024 | 8:26 PM

మండే ఎండలకు కాస్త బ్రేక్ పడనుంది. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ప్రధానంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు ఉండొచ్చని, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 15 నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టొచ్చునని.. వాతావరణం చల్లబడుతుందని తెలిపింది.

Follow us