27 ఏళ్ల కూతురికి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు.. చివరకు అసలు విషయం తెలిసి షాక్..
యువతి మెడికల్ చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లగా ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యువతి కడుపులో వృషణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. అంటే ఆమె జీవశాస్త్రపరంగా పురుషుడు. ఈ విషయం తెలియడంతో ఆ యువతి షాక్ అయ్యింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె చాలా సంవత్సరాలు ఆడపిల్లగా జీవించింది. అంతేకాదు ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఈ షాకింగ్ కేసు చైనాలోని హుబే ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. లి యువాన్ (పేరు మార్చబడింది) కడుపులో ఉన్న వృషణాలు నిజానికి పురుష హార్మోన్లు, స్పెర్మ్ ఉత్పత్తిలో సహాయపడతాయి. లి ఆడపిల్లలా పెరిగినా ఇతర అమ్మాయిల మాదిరిగా పీరియడ్స్ రాలేదు లేదా ఛాతీ కూడా అభివృద్ధి చెందలేదు అనే వాస్తవాన్ని కూడా గుర్తించారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న 27 ఏళ్ల కూతురికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు రెడీ అయ్యారు. సంతోషంగా ఏర్పాట్లు చేస్తుంటే తమ కూతురు ఆడపిల్ల కాదని.. మగపిల్లాడు అని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు షాక్ తిన్నారు. ఆ యువతి మెడికల్ చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లగా ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యువతి కడుపులో వృషణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. అంటే ఆమె జీవశాస్త్రపరంగా పురుషుడు. ఈ విషయం తెలియడంతో ఆ యువతి షాక్ అయ్యింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె చాలా సంవత్సరాలు ఆడపిల్లగా జీవించింది. అంతేకాదు ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతోంది.
ఈ షాకింగ్ కేసు చైనాలోని హుబే ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. లి యువాన్ (పేరు మార్చబడింది) కడుపులో ఉన్న వృషణాలు నిజానికి పురుష హార్మోన్లు, స్పెర్మ్ ఉత్పత్తిలో సహాయపడతాయి. లి ఆడపిల్లలా పెరిగినా ఇతర అమ్మాయిల మాదిరిగా పీరియడ్స్ రాలేదు లేదా ఛాతీ కూడా అభివృద్ధి చెందలేదు అనే వాస్తవాన్ని కూడా గుర్తించారు.
కూతురికి త్వరలో పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు ఆమెకు వైద్యం చేయించాలనిభావించారు. అయితే ఇన్వెస్టిగేషన్ రిపోర్టు తమ కూతురి జీవితంలో సంచలనం సృష్టిస్తుందని ఆ తల్లిదండ్రులకు తెలియదు. ఇన్ని సంవత్సరాలుగా ఈ నిజం తల్లిదండ్రులకు ఎలా తెలియలేదని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కుటుంబ సభ్యులు చేసిన తప్పు ఏమిటంటే
వాస్తవానికి లీ 18 సంవత్సరాల వయస్సులో ఆమె తనకి తానుగా ఆసుపత్రిలో పరీక్షించుకోవడానికి వెళ్ళింది. లీకి అండాశయ వైఫల్యం ఉందని.. అసాధారణ హార్మోన్ స్థాయిలతో బాధపడుతున్నట్లు వైద్యులు ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. అంతేకాదు మరిన్ని చేయాలనీ లీ తల్లిదండ్రులకు సూచించారు. అయితే అప్పుడు లీ కుటుంబం దానిని సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న తరుణంలో మరోసారి పరీక్ష చేయించుకోవాలని నిర్ణయించుకుంది. అప్పుడు వైద్య పరీక్షలోని ఫలితాలు అందర్నీ షాక్ కు గురిచేశాయి.
ఇది 50 వేలలో ఒకరికి
గైనకాలజిస్ట్ డువాన్ మాట్లాడుతూ లీ అమ్మాయిలా కనిపిస్తున్నప్పటికీ ఆమెలో పురుషులకు ఉన్న క్రోమోజోమ్‌లు ఉన్నాయి. దీనికి కారణం లీ పుట్టుకతో వచ్చే అడ్రినల్ హైపర్‌ప్లాసియా (CAH)తో బాధపడుతున్నట్లు వైద్యులు చెప్పారు. లీకి తన పుట్టుకలో లోపం గురించి నిజం తెలిసి షాక్ తింది. ఎందుకంటే లీ పుట్టినప్పటి నుంచి ఆడపిల్లగానే జీవితం గడుపుతోంది. డాక్టర్ చెప్పిన ప్రకారం ఇలా 50,000 మందిలో ఏ ఒకరికో జరుగుతుంది.
క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నందున వైద్యులు శస్త్రచికిత్స ద్వారా లీ కడుపులో ఉన్న వృషణాలను తొలగించారు. ఇప్పుడు లీ మరికొన్ని పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా హార్మోన్ థెరపీ కూడా చాలా కాలం పాటు తీసుకోవలసి ఉంటుంది. సకాలంలో చికిత్స అందించకపోవడంతో ఆమె విటమిన్ డి లోపం, బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నట్లు పరిశోధనలో వైద్యులు గుర్తించారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..