నార్త్ మేరీల్యాండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి, 23 మందికి గాయాలు

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 24 మంది ప్రయాణిస్తున్నట్లు మేరీల్యాండ్ స్టేట్ పోలీసులు తెలిపారు. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఉదయం 6 గంటలకు హార్ఫోర్డ్ కౌంటీలోని I-95లో అదుపు తప్పి గార్డ్‌రైల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన డ్రైవర్‌తో పాటు మరో 22 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు.

నార్త్ మేరీల్యాండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి, 23 మందికి గాయాలు
Maryland Bus Crash
Follow us
Surya Kala

|

Updated on: May 06, 2024 | 11:13 AM

అమెరికాలోని నార్త్ మేరీల్యాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇంటర్‌స్టేట్ 95లో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో మరో 23 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 24 మంది ప్రయాణిస్తున్నట్లు మేరీల్యాండ్ స్టేట్ పోలీసులు తెలిపారు. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఉదయం 6 గంటలకు హార్ఫోర్డ్ కౌంటీలోని I-95లో అదుపు తప్పి గార్డ్‌రైల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన డ్రైవర్‌తో పాటు మరో 22 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు.

విచారణ కోసం రహదారి మూసివేత

విచారణ కోసం I-95 నార్త్‌బౌండ్ లేన్‌లు మూసివేశారు. అయితే కొంత సేపటి తర్వాత తిరిగి తెరవబడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని పేర్కొన్నారు. మేరీల్యాండ్ స్టేట్ పోలీస్ క్రాష్ టీమ్ విచారణకు నాయకత్వం వహిస్తోంది. బస్సు ఎక్కచి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళుతోంది అనే అంశాలతో పాటు ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాల్టిమోర్‌కు ఉత్తరాన దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో హార్‌ఫోర్డ్ కౌంటీ ఉంది.

ఏప్రిల్ 27న ముగ్గురు మహిళల మరణం

అమెరికాలో వరుసగా భారతీయులు వివిధ కారణాలతో మరణిస్తూనే ఉన్నారు. ఏప్రిల్ 27న అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు భారతీయ మహిళలు మరణించారు. సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురు మహిళలు గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందినవారు. మృతులను రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్‌గా గుర్తించారు. ముగ్గురు మహిళలు ఎస్‌యూవీలో అత్యంత వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..