AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం, రెంట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఎక్కువ జీతం ఉన్నవారు అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటిని అద్దెకు తీసుకుంటారు. ఆదాయం తక్కువగా ఉంటె అందుకు తగిన విధంగా సౌకర్యాలు తమకు నచ్చినట్లు ఉన్నా లేకుండా ఏదోకటి నివసించడానికి అన్నట్లుగా దొరికిన గదులనే అద్దెకు తీసుకుంటారు. అయితే ఈరోజుల్లో అలాంటి అద్దె ఫ్లాట్ వార్తల్లో నిలుస్తోంది. దీని అద్దె కూడా చాలా ఎక్కువ. అంతేకాదు దీని డిజైన్ చాలా వింతగా ఉంది. కనుక దీనిని చూసిన ఎవరైనా ఆశ్చర్యపోతారు.

ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం, రెంట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Weird Flat RentImage Credit source: mediadrumimages/Frank Innes Lettings
Surya Kala
|

Updated on: May 06, 2024 | 10:09 AM

Share

ప్రస్తుతం వివిధ కారణాలతో తమ సొంత ఇంటిని వదిలి పుట్టిన ఊరుకు దూరంగా జీవిచాల్సి వస్తోంది. తమ ఇంటి నుంచి ఉద్యోగం, చదువు, వ్యాపారం ఇలా వివిధ కారణాలతో వేరే ఊరికి వెళ్లినట్లు అయితే అక్కడ అద్దె గదుల్లో నివసించాల్సి వస్తుంది. అప్పుడు ప్రజలు తమ బడ్జెట్‌కు అనుగుణంగా గదులను అద్దెకు తీసుకుంటారు. ఎక్కువ జీతం ఉన్నవారు అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటిని అద్దెకు తీసుకుంటారు. ఆదాయం తక్కువగా ఉంటె అందుకు తగిన విధంగా సౌకర్యాలు తమకు నచ్చినట్లు ఉన్నా లేకుండా ఏదోకటి నివసించడానికి అన్నట్లుగా దొరికిన గదులనే అద్దెకు తీసుకుంటారు. అయితే ఈరోజుల్లో అలాంటి అద్దె ఫ్లాట్ వార్తల్లో నిలుస్తోంది. దీని అద్దె కూడా చాలా ఎక్కువ. అంతేకాదు దీని డిజైన్ చాలా వింతగా ఉంది. కనుక దీనిని చూసిన ఎవరైనా ఆశ్చర్యపోతారు.

నిజానికి ఈ ఫ్లాట్‌లో మంచం పక్కనే టాయిలెట్‌ని నిర్మించారు. ఈ విచిత్రమైన ఫ్లాట్ అద్దె 800 పౌండ్లు అంటే మన దేశ కరెన్సీలో నెలకు దాదాపు 83 వేల రూపాయలు.

మిర్రర్ నివేదిక ప్రకారం.. ఇది ఒక చిన్న స్టూడియో ఫ్లాట్. ఇది ఇంగ్లాండ్‌లోని డెర్బీలోని ఫ్రియర్ గేట్ అనే ప్రదేశంలో ఉంది. ఈ ఫ్లాట్‌లో కిచెన్‌లోనే సోఫా ఉంది. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా పై  అంతస్తును చూసిన తర్వాత నిజంగా ఆశ్చర్యం వస్తుంది. అక్కడ మంచం పక్కన టాయిలెట్ ఏర్పాటు చేయబడి ఉంది. బేసిన్ దాని పక్కనే ఒక షవర్ ఉంది. స్నానం చేసేటప్పుడు మంచం మీద నీరు పడకుండా అడ్డుగా అద్దం ఉంది.

ఇవి కూడా చదవండి

ఫ్లాట్‌లో అన్ని సౌకర్యాలు:

ఈ విచిత్రమైన ఇల్లు అద్దెకు ఇస్తారు. ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే గది, వంటగది కనిపిస్తాయని.. పై అంతస్తులో పడకగది ఉందని చెప్పారు. ఈ ఫ్లాట్‌లో సోఫా, కాఫీ టేబుల్, టీవీ ఉన్నాయని కూడా చెప్పబడింది. అంతేకాదు వంటగదిలో ఫ్రిజ్, ఎలక్ట్రిక్ ఓవెన్ , ఎక్స్‌ట్రాక్టర్ ఫ్యాన్ కూడా అమర్చారు. అంతే కాదు ఎవరైనా ఈ ఫ్లాట్‌ని అద్దెకు తీసుకుంటే పార్కింగ్ సౌకర్యం కూడా కల్పిస్తారు. అయితే షరతు ఏమిటంటే ఈ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకోవాలంటే, మీరు 917 పౌండ్లు అంటే దాదాపు 96 వేల రూపాయల అడ్వాన్స్ డబ్బును కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..