- Telugu News Photo Gallery Summer Health Tips: do not eat these things over ice cream can cause serious health issues
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి.. ఈ ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..
ఐస్ క్రీమ్ పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఇష్టంగా తినే డైరీ ఫుడ్. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు వేడి నుంచి ఉపశమనం కోసం చల్లదనం ఇచ్చే ఆహారాన్ని తినడానికి ఆసక్తిని చూపిస్తారు. వేసవి కాలం ప్రారంభం కాగానే వాతావరణం వేడి నుంచి తప్పించుకోవడానికి ఐస్‌క్రీం తినడం మొదలు పెడతారు. ఈ సీజన్‌లో ఐస్ క్రీమ్ లో విభిన్న రుచులు లభిస్తాయి. సమ్మర్ సీజన్‌లో డెజర్ట్ అంటే ఐస్‌క్రీమ్ అనే విధంగా పిల్లలు, పెద్దలు లాగించేస్తారు.
Updated on: May 06, 2024 | 8:03 AM

కొంతమంది ఐస్ క్రీం తర్వాత కొన్ని పదార్థాలు తింటారు. ఇలా తినడం వలన ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ఐస్ క్రీం తిన్న తర్వాత వీటిని తినడం హానికరం. ఐస్ క్రీం తిన్న తర్వాత తినకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

హాట్ డ్రింక్స్ లేదా కెఫిన్ పానీయాలు: ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా టీ, కాఫీ, సూప్ వంటి వేడి వేడి పదార్థాలు తినకూడదు. దీని వల్ల దగ్గు, కడుపునొప్పి, గొంతునొప్పి, నొప్పులు వంటి సమస్యలు రావచ్చు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వీటిని తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారుతుంది. ఇది దగ్గు, జలుబుతో పాటు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

పుల్లటి పండ్లు: ఐస్ క్రీం లేదా దానితో పాటు, నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను తినకూడదు. దీని వల్ల మీకు ఎసిడిటీ లేదా అజీర్ణం సమస్య రావచ్చు. సిట్రస్ పండ్లలో ఆమ్లం ఉంటుంది. ఇది ఐస్‌క్రీమ్‌లో ఉండే పాలతో చర్య జరిపి కడుపు నొప్పిని కలిగిస్తుంది.

ఎక్కువ స్పైసీ ఫుడ్: ఐస్ క్రీం తిన్న వెంటనే మసాలా పదార్థాలు తినడం వల్ల కడుపులో చికాకు, అజీర్ణం, విరేచనాలు వస్తాయి. స్పైసీ ఫుడ్‌లో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది ఐస్‌క్రీమ్‌లో ఉండే పాలతో చర్య జరుపుతుంది.

మద్యం సేవించవద్దు: ఐస్ క్రీం తిన్న తర్వాత మద్యం సేవించడం వల్ల సమస్యలు వస్తాయి. ఆల్కహాల్ తాగడం వల్ల ఐస్‌క్రీమ్‌లో ఉండే పాల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది కడుపు నొప్పితో పాటు వాంతులు, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుంది.

ఆయిల్ ఫుడ్: ఐస్ క్రీమ్ తిన్న వెంటనే బిర్యానీ, మటన్ లేదా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ వంటి ఆయిల్ ఫుడ్ తినడం మంచి కాదు. ఇలా తినడం వలన కడుపు భారంగా మారుతుంది. అజీర్ణానికి కారణమవుతుంది. ఐస్‌క్రీమ్‌తో పాటు ఆయిల్ ఫుడ్ తింటే ఆ ఆహారం జీర్ణం కావడానికి సమయం తీసుకుంటుంది. దీని కారణంగా కడుపులో నొప్పి, బరువుగా అనిపించవచ్చు.




