AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిచ్చి పరాకాష్టకు చేరింది ..! వెరైటీ కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టిన జంట.. ధైర్యముంటేనే ఈ వీడియో చూడండి..

రొమాంటిక్ డేట్‌కి వెళ్లడానికి ఇష్టపడని జంట ఎవరూ ఉండరు. కానీ, మీరు భయానక డేట్‌ ప్లేస్‌కి వెళ్లేవాళ్లను గురించి విన్నారా..? అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వైరల్‌ వీడియోలో చాలా విచిత్రమైన ప్రదేశంలో డిన్నర్‌ చేసేందుకు కూర్చున్న ఒక జంటను చూస్తారు. ఇది డబుల్ సూసైడ్ మిషన్ కాదా? అంటున్నారు వీడియో చూసిన నెటిజన్లు.

పిచ్చి పరాకాష్టకు చేరింది ..! వెరైటీ కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టిన జంట.. ధైర్యముంటేనే ఈ వీడియో చూడండి..
Sky High Dinner
Jyothi Gadda
|

Updated on: May 06, 2024 | 9:42 AM

Share

చాలా మంది వ్యక్తులు సాహసంతో కూడిన యాత్రలకు వెళ్లడానికి ఇష్టపడతారు. కొందరు ఆసక్తికరంగా, ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా అడ్వేంచర్స్‌ చేయాలనుకుంటారు.. కానీ, ఈ జంటకు సంబంధించిన ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నిజానికి,ఈ జంట ఎప్పటికీ గుర్తుండిపోయేలా, సరికొత్తగా స్కై హై డిన్నర్‌కి వెళుతుంది. ఇందుకోసం డైనింగ్‌ టేబుల్, కుర్చీని కేబుల్‌తో బంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ స్థలం చుట్టూ పచ్చని పర్వతాలు కనిపిస్తున్నాయి. వీరు కూర్చున్న కేబుల్ క్రింద ఒక కందకం ఉంది. ఆ జంట దానిపై కూర్చుని భోజనం చేసేందుకు రెడీగా ఉన్నారు. అంతేకాదు.. అది రోప్-వే లాగా గాల్లో ఊగుతూ పనిచేయడం ప్రారంభిస్తుంది.

ఈ వీడియోలో వెనుక నుండి ఒక మహిళ అరుస్తున్న శబ్దం కూడా మీకు వినబడుతుంది. చాలా మంది వ్యక్తులు కలిసి దానిని నెట్టడం కూడా కనిపిస్తుంది. ఈ వీడియో ఎలాంటి సాహసోపేతమైన కార్యకలాపంలా కనిపించడం లేదు. కానీ, భయానకంగా మాత్రం ఉంది. ఇది అంత సురక్షితం కాదంటున్నారు చాలా మంది నెటిజన్లు . ఇది Instagram హ్యాండిల్ @tobot_travelలో షేర్‌ చేయబడింది. దీనికి ఇప్పటి వరకు 41 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఇది మాత్రమే కాదు, ఈ వీడియోకు 217 మిలియన్లకు పైగా వీక్షణలు కూడా వచ్చాయి. దీన్ని బట్టి ఇది గత రెండు నెలలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత వైరల్ అవుతుందో ఊహించుకోవచ్చు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

ఒక వినియోగదారు ఇలా వ్రాశారు – వెనుక నుండి అరుస్తున్న వ్యక్తి వీడియో వైబ్‌ను పాడుచేస్తున్నాడు. మరొక వినియోగదారు ఇలా వ్రాశారు – ఇది డబుల్ సూసైడ్ మిషన్ కాదా? అంటున్నారు. మరో వినియోగదారు స్పందిస్తూ..ఓరీ దేవుడో వీరికి సెఫ్టీ బెల్ట్ లేదు, ఇతర భద్రతా ప్రమాణాలు ఏవీ పాటించలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us