AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైగర్ రిజర్వ్ మధ్యలో ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆనంద్ మహీంద్ర.. ఇది ఎక్కడో కాదండోయ్

ఈ హైవేను నిర్మించిన తీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆధునిక అభివృద్ధి, సహజ ఆవాసాల మధ్య సామరస్యానికి ఈ ఫోటోలు గొప్ప ఉదాహరణ అవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్‌ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్‌ చేయబడుతోంది. దీనిని చాలా మంది ఇష్టపడుతున్నారు. ఎంతో అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

టైగర్ రిజర్వ్ మధ్యలో ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆనంద్ మహీంద్ర.. ఇది ఎక్కడో కాదండోయ్
Pench Tiger Reserve
Jyothi Gadda
|

Updated on: May 06, 2024 | 7:15 AM

Share

మహీంద్రా అండ్ మహీంద్రా చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. తన ఆసక్తికరమైన పోస్ట్‌లతో నెటిజన్లు ఆకట్టుకుంటారు. ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన ప్రతి పోస్ట్‌లోనూ ఒక ఖచ్చితమైన సందేశం, వివరణ ఉంటుంది. అందుకు అతను పెట్టిన ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంది. ఇటీవల అతను అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణ రెండింటినీ సమానంగా, జాగ్రత్తగా చూసుకున్న ఒక అద్భుత ఫోటోను ఎక్స్‌లో షేర్‌ చేశారు. టైగర్ రిజర్వ్ మధ్యలో నిర్మించిన హైవే కింద పులి వెళ్తున్న ఫోటోను షేర్ చేయడంతో ప్రజలు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వైరల్‌ అవుతున్న ఫోటోకు సంబంధించి… ఇది మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ (పెంచ్ నేషనల్ పార్క్) వద్ద నిర్మించిన హైవే ఫొటోను ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. ఈ హైవేను నిర్మించిన తీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇందులో రెండు ప్రత్యేక వీక్షణలు చూడవచ్చు. మొదటిది జాతీయ రహదారి 44 దట్టమైన అడవి గుండా వెళుతున్న ఒక ఎత్తైన రహదారిని చూపుతుంది. రెండవది అదే ఎత్తైన రహదారి కింద నుంచి పులి రాజసాన్ని ప్రదర్శిస్తూ నడుచుకుంటూ వెళ్తోంది. ఆనంద్ మహీంద్ర ఈ ఫొటోను షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఫొటోకు రెండున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఏడు వేల కంటే ఎక్కువ మంది ఈ పోస్ట్‌కి లైక్‌లు కొట్టారు.

ఈ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఆనంద్‌ మహీంద్రా ఇలా రాశారు..పెంచ్ టైగర్ రిజర్వ్ మీదుగా జాతీయ రహదారి 44లో భాగంగా దీన్ని నిర్మించారని తెలిపారు. వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించుకునేలా వాటికి రహదారి ఏ మాత్రం అడ్డురాని విధంగా దీన్ని నిర్మించారని చెప్పారు. హైవే కింద నుంచి వన్యప్రాణులు హాయిగా సంచరించవచ్చని తెలిపారు. ఆధునిక అభివృద్ధి, సహజ ఆవాసాల మధ్య సామరస్యానికి ఈ ఫోటోలు గొప్ప ఉదాహరణ అవుతుందని వెల్లడించారు.

ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్‌ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్‌ చేయబడుతోంది. దీనిని చాలా మంది ఇష్టపడుతున్నారు. ఎంతో అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..