AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడి టెంకే కదా అనుకుంటే పొరపడినట్టే.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకపై దాచుకుంటారు!

మామిడి గింజల కోసం ముందుగా మామిడి టెంకలను తీసుకుని అందులోని లేత నల్లటి సీడ్‌ను సేకరించి పెట్టుకోవాలి. దానిని బాగా ఆరనిచ్చి పొడిగా చేసుకుని నిల్వచేసుకోవాలి. ఇది 5-5 గ్రాముల పరిమాణంలో ప్రతి ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీటితో తీసుకుంటే.. 15 రోజుల్లో ఈ సమస్యలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మామిడి టెంకే కదా అనుకుంటే పొరపడినట్టే.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకపై దాచుకుంటారు!
Mango Seeds
Jyothi Gadda
|

Updated on: May 05, 2024 | 1:13 PM

Share

వేసవి అంటేనే మామిడి సీజన్‌.. మార్కెట్ల నిండా మామిడి రకాలు సందడి చేస్తుంటాయి. చాలా మందికి మామిడి కాయలన్నా, పండ్లన్నా బాగా ఇష్టపడుతుంటారు. కొందరు మామిడి జ్యూస్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. మరికొందరు కోసుకుని తింటారు. మామిడిపండు రుచికి ఎంత మేలు చేస్తుందో దాని పిక్కలోని గింజలతో ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుందని మీకు తెలుసా..?ఆయుర్వేదంలో, మామిడి గింజలు ఔషధంగా చెబుతున్నారు. దీన్ని సరైన పద్ధతిలో తీసుకుంటే పిత్తం, చుండ్రు, విరేచనాలు, చర్మ సంబంధిత సమస్యలు, ఆకలి మందగించడం వంటి సమస్యలు చాలా తేలికగా పరిష్కారమవుతాయి. మామిడి గింజల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఇది తెలిసిన తర్వాత మీరు ఇప్పటివరకు విత్తనాలను విసిరివేసి ఎంత పెద్ద తప్పు చేశారో మీకు అర్థమవుతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1. అతిసారం

మామిడి గింజల్లో చాలా విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దానివల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మామిడి గింజల పొడిని రోజుకు మూడుసార్లు తింటే విరేచనాలు నయమవుతాయి. మామిడి గింజలను ఎండబెట్టి రుబ్బుకోవాలి. ఇప్పుడు 1-2 గ్రాముల పరిమాణంలో తేనెతో కలిపి తింటే ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

2. ఊబకాయం

మామిడి గింజల సారం ఊబకాయం ఉన్నవారి అధిక బరువును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

3. కొలెస్ట్రాల్

మామిడి గింజ రక్త ప్రసరణను పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది పరోక్షంగా రక్తంలో చక్కెర, సి-రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

4. మాయిశ్చరైజర్

పొడి చర్మానికి మామిడి గింజల ఆయిల్‌ ఒక వరం. పొడి చర్మానికి ఇది బెస్ట్ లోషన్. ముఖ్యంగా కళ్ళు, మెడ వంటి సున్నితమైన ప్రాంతాలకు అప్లై చేసి మర్ధనా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5. పొడి పెదవులు

మామిడి గింజల ఆయిల్‌ను 100శాతం సహజ లిప్ బామ్‌గా హైడ్రేట్ చేయడానికి, పొడి పెదాలను మృదువుగా చేయడానికి ఉపయోగించవచ్చు. నిద్రపోయే ముందు పొడి పెదవులపై ఔషధతైలం లాగా రాయండి. ఇది చర్మ కణాలను పునరుజ్జీవింపజేస్తుంది. తేమగా ఉండేలా చేస్తుంది. చనిపోయిన చర్మ కణాలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

6. మొటిమలు

మీరు మామిడి గింజల నుండి ఒక స్క్రబ్‌లా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది మొటిమలతో పోరాడడంలో సహాయపడుతుంది. మామిడి గింజలను గ్రైండ్ చేసి వాటిని టమాటోతో కలిపి ముఖానికి సమంగా రాయాలి. ఈ స్క్రబ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, బ్లాక్‌హెడ్స్, బ్రేక్‌అవుట్‌లు, మొటిమలు, మచ్చలను నయం చేయడానికి రంధ్రాలను అన్‌లాగింగ్ చేయడానికి, ఎరుపును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

7. గుండె జబ్బు

మామిడి గింజల మితమైన వినియోగం గుండె జబ్బులు, అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నాడీ వ్యవస్థ గుండె, రక్త నాళాలకు అనుసంధానించబడి ఉంది. అందువల్ల, రోజువారీ ఆహారంలో మామిడి గింజలను తక్కువ మొత్తంలో తీసుకుంటే గుండె సమస్యలు, అధిక రక్తపోటును దూరం చేస్తుంది.

8. చుండ్రు

మామిడి గింజలు చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడతాయి. మామిడి గింజల వెన్న తీసుకుని జుట్టుకు అప్లై చేయడం వల్ల మెరుపు, బలం వస్తుంది. మీరు దీన్ని ఆవాల నూనెలో కలిపి కొన్ని రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల బట్టతల, జుట్టు రాలడం, త్వరగా నెరవడం, చుండ్రు వంటి సమస్యలు అదుపులో ఉంటాయి.

9. ఆరోగ్యకరమైన దంతాలు

మామిడి గింజల నుండి టూత్ పౌడర్ తయారు చేయవచ్చు. అరచేతిపై కొద్దిగా తీసుకుని టూత్ బ్రష్ ను తడిపి అందులో ముంచి పళ్ళు తోముకోవాలి. ఈ పొడి మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

10. ఆరోగ్యకరమైన చర్మం

మామిడి గింజల నూనె ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్. చర్మానికి పోషణ, తేమతో పాటు, ఇది అనేక లోషన్లలో కూడా ఉపయోగించబడుతుంది. ఈ మ్యాంగో బటర్‌ను ముఖానికి రాసుకుంటే జిడ్డుగా ఉండదు. మామిడి గింజల కోసం ముందుగా మామిడి టెంకలను తీసుకుని అందులోని లేత నల్లటి సీడ్‌ను సేకరించి పెట్టుకోవాలి. దానిని బాగా ఆరనిచ్చి పొడిగా చేసుకుని నిల్వచేసుకోవాలి. ఇది 5-5 గ్రాముల పరిమాణంలో ప్రతి ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీటితో తీసుకుంటే.. 15 రోజుల్లో ఈ సమస్యలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..