యోగా చేయడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీర వాపు, ఆందోళనను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సమతుల్యతను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మెడిటేషన్, యోగా చేయడం ద్వారా జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. కానీ మీరు హార్ట్ పేషెంట్ అయితే మీరు కొన్ని యోగా ఆసనాలు వేయకూడదు. లేకుంటే గుండె సంబంధిత ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.