AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు..

నరసింహను ఇనుప గొలుసుతో కట్టేసి గదిలో బంధించింది. మూడు రోజుల పాటు తీవ్రంగా కొట్టారు కూడా. ఇంతలో స్థానికులు ఇదంతా రహస్యంగా తమ మొబైల్ ఫోన్లలో వీడియో చిత్రీకరించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నలుగురు పిల్లలపై కేసు నమోదు చేశారు.

Telangana: భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు..
A Man Was Chained And Locke
Jyothi Gadda
|

Updated on: May 05, 2024 | 10:41 AM

Share

ఇన్ని రోజులు టీవీలో ఏ వార్త చూసినా, న్యూస్‌ పేపర్‌ తిరగేసినా భార్యను కొట్టిన భర్త, మొగుడి చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్న పెళ్లాం.. ఇలాంటి వార్తలే కనిపించేవి. తాగుడుకు అలవాటు పడ్డ వ్యక్తి పీకలదాకా తాగొచ్చి భార్యను తీవ్రంగా కొట్టాడని, అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడనే సంఘటనలు అనేకం చూస్తుంటాం. కానీ, కాలం మారింది. ప్రస్తుతం ఇదంతా రివర్స్‌లో జరుగుతోంది. వాటన్నింటికీ భిన్నంగా.. తాళికట్టిన భర్తను గొలుసులతో కట్టేసి మూడు రోజుల పాటు చిత్రహింసలు పెట్టిందో భార్య. అందుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఇంట్లో గొడవల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్తగారు, కోడలు, భర్త-భార్యల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగిన సందర్భాలు అనేకం సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. భార్యాభర్తలు అన్నప్పుడు గొడవలు సహజం. తగాదాలు లేని ఒక్క జంట కూడా భూమిపై లేదు. ఇదిలా ఉంటే ఆస్తులపై వివాదాలు కొత్తేమీ కాదు. ఆస్తి విషయంలో మొదలైన అలాంటి వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. యాదాద్రి జిల్లా ఘట్‌కేసర్‌లోని అంబేద్కర్‌ నగర్‌లోని తమ ఇంట్లో ఆస్తి కోసం 45 ఏళ్ల మహిళ తన భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలకు గురి చేసింది. భార్య తన భర్తను ఇంట్లో మూడు రోజులు కట్టివేసి కొట్టింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఘట్‌కేసర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్‌ నగర్‌లో నివాసముంటున్న పత్తి నరసింహ(50), అతని భార్య భారతమ్మ (45) మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. నరసింహ పేరు మీద ఉన్న భూమి అమ్మకాలపై ఆయన ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు నిత్యం గొడవ పడేవారు. తన భార్యకు చెందిన స్థలంలో ఇల్లు కట్టుకున్న భర్త ఈసారి ఇల్లు కట్టేటప్పుడు తీసుకున్న అప్పును తన పేరు మీద ఉన్న భూమిని అమ్మాలని ప్రతిపాదించాడు. ఆ తర్వాత వాగ్వాదం మొదలై నరసింహులు ఇల్లు వదిలి ఒంటరిగా జీవించడం మొదలుపెట్టాడు.

భర్త భువనగిరి జిల్లాలో ఉంటున్నాడని తెలుసుకున్న భారతమ్మ ఏప్రిల్ 30న పిల్లలతో కలిసి అతడిని కలవడానికి వెళ్లి ఇంటికి తీసుకొచ్చింది. అనంతరం నరసింహను ఇనుప గొలుసుతో కట్టేసి గదిలో బంధించింది. మూడు రోజుల పాటు తీవ్రంగా కొట్టారు కూడా. ఇంతలో స్థానికులు ఇదంతా రహస్యంగా తమ మొబైల్ ఫోన్లలో వీడియో చిత్రీకరించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నలుగురు పిల్లలపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి