AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం మూఢనమ్మకం సామీ..! పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు.. చివరకు..?!

పాముకాటుతో చనిపోయిన వ్యక్తి బతకాలంటే మృతదేహాన్ని గంగా నదిలో నిమజ్జనం చేయాలని, అతని శరీరంలోని విషాన్ని తొలగించాలని ఎవరో చెప్పిన మూఢ మాటలు నమ్మి మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తాడుతో కట్టి రెండు రోజుల పాటు గంగా నదిలో వేలాడిదీశారు. గంగా నదిలో మృత దేహం వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

ఇదేం మూఢనమ్మకం సామీ..! పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు.. చివరకు..?!
Ganga River
Jyothi Gadda
|

Updated on: May 05, 2024 | 7:55 AM

Share

దేనినైనా గుడ్డిగా నమ్మడాన్ని మూఢనమ్మకం అంటారు. గ్రామాలు, మారుమూల పల్లెల్లోని ప్రజలు చాలా మంది అనేక విషయాల్లో మూఢనమ్మకాలనే విశ్వసిస్తుంటారు. వివిధ రకాల మూఢనమ్మకాలను పాటిస్తుంటారు. వీటిలో చేతబడి, మంత్రాలు, నరబలి, దెయ్యం పట్టిందని వదిలించే పనులు చేస్తుంటారు. జంతుబలి కూడా చేస్తుంటారు. అయితే, ఏ విషయంలోనైనా మితిమీరిన మూఢనమ్మకం మంచిది కాదు. ఇలాంటి నమ్మకాలతో చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మూఢనమ్మకాల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే అనేకం చూశాం. తాజాగా మరో వీడియో సంచలనంగా మారింది. పాముకాటు కారణంగా చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్తులు రెండు రోజులపాటు నీటిలో వేలాడదీసిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో మూఢ నమ్మకాలకు సంబంధించిన షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్‌ 26న మోహిత్‌ అనే 20 ఏళ్ల యువకుడు పాము కాటుకు గురయ్యాడు. అది గమనించిన స్థానికులు వెంటనే ఆ యువకుడిని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. పాముకాటుతో చనిపోయిన వ్యక్తి బతకాలంటే మృతదేహాన్ని గంగా నదిలో నిమజ్జనం చేయాలని, అతని శరీరంలోని విషాన్ని తొలగించాలని ఎవరో చెప్పిన మూఢ మాటలు నమ్మి మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తాడుతో కట్టి రెండు రోజుల పాటు గంగా నదిలో వేలాడిదీశారు.

ఇవి కూడా చదవండి

ఇలా వేలాడదీయడం వల్ల పాము కాటుకు గురైన వ్యక్తి ఒంట్లో విషయం మొత్తం నీటిలోకి వెళ్ళిపోతుందని వారి మూఢనమ్మకం. అయితే ఇలా రెండు రోజుల పాటు చేసినా ఫలితం లేకపోయింది. అతడి శరీరంలో ఎలాంటి చలనము లేకపోవడంతో చివరకు మృతదేహాన్ని గ్రామ శివారులోని ఘాట్ పై దహనం చేశారు. గంగా నదిలో మృత దేహం వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వీడియోలో వ్యక్తి మృతదేహం గంగా ప్రవాహంలో వేలాడుతోంది. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఈ దృశ్యాన్ని వీక్షిస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి