- Telugu News Photo Gallery Cashew nuts here are the side effects of consuming cashew nuts Telugu Lifestyle News
అతిగా తింటే విషమే..! జీడిపప్పును ఎక్కువగా తింటే ఇలా అవుతుందా..?
డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరూ తింటుంటారు. ఇందులో ముక్యంగా జీదడిపప్పు చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడుతుంటారు. తినడమే కాకుండా ఆహారాల్లో కూడా ఉపయోగిస్తారు. అయితే, జీడిపప్పును ఎక్కువగా తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని క్యాలరీలు ఊబకాయం, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
Updated on: May 04, 2024 | 9:43 PM

జీడిపప్పు అధిక ఆక్సలేట్ కంటెంట్ కలిగి ఉంటుంది. అందువల్ల వీటిని మరీ ఎక్కువ పరిమాణంలో తిన్నప్పుడు, ఇది మూత్రపిండాల నష్టంతో పాటు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముడి జీడిపప్పు సురక్షితమైనదికాదు. వేయించిన లేదా కాల్చిన జీడిపప్పు తినటం సురక్షితం అని చెబుతున్నారు.

జీడిపప్పును ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని క్యాలరీలు ఊబకాయం, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. జీడిపప్పులో మెగ్నీషియం, కాల్షియం ఉండటం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయంటున్నారు.

ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తిన్న తర్వాత తక్కువ నీరు తాగితే డీహైడ్రేషన్ సంభవించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జీడిపప్పును రోజువారీ తినే డ్రైఫ్రూట్స్, నట్స్‌తో నిక్షేపంగా తీసుకోవచ్చు. అయితే ఇతర గింజలతో పోలిస్తే జీడిపప్పులో కేలరీలు ఎక్కువ. దీనివల్ల తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజువారీగా వీటిని తినేప్పుడు మోతాదు చాలా ముఖ్యం.

జీడిపప్పులో పోషకాలు కూడా ఎక్కువే. అధిక మోతాదులో అసంతృప్త కొవ్వులు, విటమిన్-ఇ, కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఫాస్పరస్, విటమిన్-కె లాంటివి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడానికి, బీపీని నియంత్రణలో ఉంచడానికి సాయపడతాయి. ఇందులోని అసంతృప్త కొవ్వులు మెదడును చురుగ్గా ఉంచుతాయి.

పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగేందుకు సహకరిస్తాయి. మంచి నిద్రకు తోడ్పడతాయి. కాబట్టి, పూర్తి ఆరోగ్యవంతులు రోజులో మూడు నాలుగు జీడిపప్పులు నిస్సంకోచంగా తీసుకోవచ్చు. ఎక్కువగా తింటే మాత్రం అదనపు కేలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేకపోతే బరువు పెరుగుతారు.




