AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే పరేషానే..

అడవి లోపల నుంచి ఒక్కొక్కటిగా నాలుగు సింహం పిల్లలు బయటకు వచ్చాయి. ఒక సింహం దాని పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు వాటిని ఇలా రోడ్డుపైకి తీసుకొచ్చినట్టుగా ఉంది ఇక్కడ సీన్. తల్లి సింహం ముందుకు నడుస్తూ వెళ్తుండగా,.. దాని పిల్లలు మెల్లమెల్లగా తల్లిని అనుసరిస్తున్నాయి.

Viral Video: పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే పరేషానే..
Lion Cubs Race
Jyothi Gadda
|

Updated on: May 05, 2024 | 10:18 AM

Share

వేటాడాలి అనేది అడవి చట్టం. అడవిలో జీవించే ప్రతి జీవి తప్పనిసరిగా వేటా నేర్చుకోవాల్సిందే. అది తమను తాము రక్షించుకోవటానికి, ఆహారం సంపాదించుకోవటానికి తప్పనిసరిగా అవసరం. అందుకే చాలా జంతువులు దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ పిల్లలకు శిక్షణ ఇస్తాయి. ఇలాంటి విషయాలకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక్కడ కూడా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఒక సింహం తన పిల్లలతో అడవిలో తిరుగుతూ కనిపిస్తుంది.

వైరల్ అయిన యూట్యూబ్ వీడియో అడవికి సంబంధించినదిగా తెలుస్తోంది. అటవీ మార్గంలో కొన్ని కార్లు ఆగి ఉండటం కనిపిస్తుంది. రోడ్డుకు అడ్డంగా రెండు పెద్ద సింహాలు, నాలుగు సింహం పిల్లలతో కలిసి ఉన్నాయి. అడవి లోపల నుంచి ఒక్కొక్కటిగా నాలుగు సింహం పిల్లలు బయటకు వచ్చాయి. ఒక సింహం దాని పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు వాటిని ఇలా రోడ్డుపైకి తీసుకొచ్చినట్టుగా ఉంది ఇక్కడ సీన్. తల్లి సింహం ముందుకు నడుస్తూ వెళ్తుండగా,.. దాని పిల్లలు మెల్లమెల్లగా తల్లిని అనుసరిస్తున్నాయి.

అడవి జంతువుల నుండి తమ పిల్లలను రక్షించుకోవడానికి సింహాలు తమ పిల్లలకు బహిరంగ రహదారిపై శిక్షణ ఇస్తున్నట్టుగా వీడియో చూస్తుంటే స్పష్టం అర్థమవుతుంది. తల్లిదండ్రులు ముందుకు నడవడం, సింహం పిల్లలు నెమ్మదిగా వారి వెనుక వెంబడించడం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్ నుండి వచ్చింది. టెస్ట్ సైటింగ్స్ CEO, వ్యవస్థాపకుడు నాదవ్ తన సహచరులతో కలిసి అడవికి వెళ్లినప్పుడు ఇలాంటి దృశ్యం వారి కంటపడింది. సుమారు ఒక గంట పాటు ఈ అభ్యాసం సాగింది. ఈ దృశ్యాన్ని చూసిన అతను తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇలాంటి అసాధారణ దృశ్యాన్ని తను కళ్లరా చూడటం అదృష్టంగా భావిస్తున్నానంటూ అతను క్యాప్షన్‌లో వెల్లడించారు. ఈ వీడియోను మే 3న YouTube ఛానెల్ @Latestsightings ద్వారా సోషల్ మీడియాలో షేర్‌ చేసారు. ప్రస్తుతం వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి