గూగుల్ సంస్థలో ఉద్యోగం చేయడం ఓ యువతి కల.. తన డ్రీమ్‌ని నెరవేర్చుకోవడానికి నాలుగు సార్లు ఫెయిల్ అయినా ఆగలేదు..
గూగుల్‌లో ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం అని అందరికీ తెలిసిందే. ఈ కంపెనీలో ఉద్యోగాన్ని పొందడానికి ఇంటర్వ్యూల్లో అనేక రౌండ్లు ఉంటాయి. వీటిల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పని కష్టంగా ఉన్నా .. కొందరు చాలా సులువుగా ఉద్యోగాలు పొందే వారు కూడా ఉన్నారు. అదే సమయంలో గూగుల్ లో సెలక్ట్ అవ్వకపోతే ఇతర సంస్థల్లో ఉద్యోగాని సొంతం చేసుకున్నవారున్నారు. అయితే కొందరు మొండి పట్టుదలతో విజయం సాధిస్తారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కథలో ఓ అమ్మాయి గూగుల్‌లో ఉద్యోగంకోసం చేసే ప్రయత్నంలో చాలా సార్లు తిరస్కరణకు గురైంది. అయినప్పటికీ నిరాశ చెందక తన లక్ష్యాన్ని సాధించింది.
జీవితంలో నిరంతర తిరస్కరణను ఎదుర్కొంటు ఉంటే ఎవరైనా సరే చాలా నిరుత్సాహానికి గురవుతారు. ఒకొక్కసారి ఇక జీవితంలో ఏదీ సాధించలేమా అనే నిరాశ నిసృహలతో నిండిపోతారు. భవిష్యత్ ఏమిటా అని భయ పడతారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సవాళ్లను, ఇబ్బందులను అధిగమించడం చాలా ముఖ్యమైన విషయం. ఎవరైనా జీవితంలో గెలిస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరనే విషయాన్నీ నమ్మండి ఎందుకంటే తిరస్కారం మిమ్మల్ని మునుపటి కంటే బలపరిచే శక్తి. ఇక్కడ ఉన్న ఏకైక షరతు ఏమిటంటే మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రస్తుతం ప్రజల్లో ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది.
గూగుల్‌లో ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం అని అందరికీ తెలిసిందే. ఈ కంపెనీలో ఉద్యోగాన్ని పొందడానికి ఇంటర్వ్యూల్లో అనేక రౌండ్లు ఉంటాయి. వీటిల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పని కష్టంగా ఉన్నా .. కొందరు చాలా సులువుగా ఉద్యోగాలు పొందే వారు కూడా ఉన్నారు. అదే సమయంలో గూగుల్ లో సెలక్ట్ అవ్వకపోతే ఇతర సంస్థల్లో ఉద్యోగాని సొంతం చేసుకున్నవారున్నారు. అయితే కొందరు మొండి పట్టుదలతో విజయం సాధిస్తారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కథలో ఓ అమ్మాయి గూగుల్‌లో ఉద్యోగంకోసం చేసే ప్రయత్నంలో చాలా సార్లు తిరస్కరణకు గురైంది. అయినప్పటికీ నిరాశ చెందక తన లక్ష్యాన్ని సాధించింది.
తిరస్కరణతో కోరిక బలంగా మారింది.
చదవు ముగించుకున్న తర్వాత బంగారు భవిష్యత్ కోసం ఉద్యోగం సంపాదించాలని ప్రతి యువత కల కంటుంది. అందులోనూ గూగుల్ వంటి సంస్థలో ఉద్యోగం సంపాదించాలానే కల కంటుంది. అలా కల కన్న ఓ యువతి సాధారణ వ్యక్తుల మాదిరిగానే ఉద్యోగ ప్రయత్నంలో రిజెక్ట్ అయింది. ఆమె పట్టుదల వదల్లేదు. మళ్ళీ ప్రయత్నం కొనసాగించింది. వాంగ్ 2018లో మొదటిసారి ప్రయత్నించింది. ఆమె కష్టపడింది. ఎంత ఉత్సాహంగా ప్రయత్నించినా ఆమె ఎంపిక కాలేదు. అయినప్పటికీ ఎలాగైనా గుగూల్ లో ఉద్యోగం చేయాలనే సంకల్పంతో మరోసారి సిద్ధమై ఉద్యోగ ప్రయత్నం చేసింది. మళ్లీ ఆమె ఎంపిక కాలేదు. ఇలా మూడవ, నాల్గవ సారి అదే జరిగింది. మళ్ళీ 2022 సంవత్సరంలో ఐదవసారి.. ఆమె కష్టానికి ఫలితం దక్కింది. ఆమెకు గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది.
ఆ యువతి తన కథను ఇంటర్నెట్‌లో షేర్ చేసింది. ఆ యువతి ప్రయత్నాన్ని ఇష్టపడటమే కాదు విస్తృతంగా షేర్ చేశారు. అంతే కాదు వాంగ్ ప్రయత్నం పై తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. ఒకరు ఇలా వ్రాశారు తిరస్కరణ కంటే పెద్ద ఉపాధ్యాయుడు లేడని ఎవరో సరిగ్గా చెప్పారు.’ మరొకరు, ‘తిరస్కరణ మనకు చాలా నేర్పుతుంది’ అని రాశారు. అంతేకాదు చాలా మంది ఇతర వినియోగదారులు దీనిపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల నాకోసం ఇక్కడ క్లిక్ చేయండి..