తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. భానుడి భగభగలు నుంచి ఉపశనం.. మరో రెండు రోజులు వర్షాలు
భానుడు భగభగలు, ఎండ వేడి, వడగాల్పులు తో తెలుగు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలో సెడన్‌గా వాతావరణం మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల వర్షం పడింది. జనగామ, ములుగు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఏటూరు నాగారం బుల్లయ్య అనే రైతు, కోడూరులో అజయ్ అనే రైతు పిడుగుపాటుతో మృతి చెందారు. రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామంలో లేగదూడ మృతి చెందింది. అటు ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా చిత్తూరు జిల్లాలో వాతావరణం మారిపోయంది. తిరుమలలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం దాటికి తిరుమల వీధులు జలమయం అయ్యాయి. దర్శనానికి వెళ్లే భక్తులు కొంత ఇబ్బందిపడ్డారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఎండలతో వణికిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ గూడ్ న్యూస్ చెప్పింది. మరో మూడు రోజుల్లో ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. మరో వైపు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉంది. తెలంగాణలో ఇవాళ్టి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ప్రధానంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు ఉండొచ్చని, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..