AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Elections 2024: ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్ ఇదే..

కూటమి కోసం సారొస్తున్నారు. ఇవాళ రాజమండ్రి, అనకాపల్లికి మోదీ వస్తున్నారు. ఆయన రాకతో క్లైమాక్స్‌లో కాక పెంచాలని కూటమి ప్లాన్‌ చేసింది. ఏపీలో మోదీ సభలు, రోడ్‌ షోలకు భారీగా ప్లాన్‌ చేసింది. మే 6, 8 తేదీల్లో కూటమి తరపున ప్రచారంలో మోదీ పాల్గొంటారు. ఏపీపై బీజేపీ ఫోకస్‌ పెంచింది. ఏపీ ఎన్నికల ప్రచారం చివరి చరణంలో మోదీ రాక వేడి పుట్టిస్తోంది. కూటమి కోసం ప్రచారం చేయడానికి ఏపీ వస్తున్నారు మోదీ. ఇవాళ రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. 8వ తేదీన రాజంపేట పార్లమెంట్‌ స్థానం పరిధిలోని పీలేరులో సభకు మోదీ హాజరవుతారు.

AP Elections 2024: ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Pm Modi
Srikar T
|

Updated on: May 06, 2024 | 6:35 AM

Share

కూటమి కోసం సారొస్తున్నారు. ఇవాళ రాజమండ్రి, అనకాపల్లికి మోదీ వస్తున్నారు. ఆయన రాకతో క్లైమాక్స్‌లో కాక పెంచాలని కూటమి ప్లాన్‌ చేసింది. ఏపీలో మోదీ సభలు, రోడ్‌ షోలకు భారీగా ప్లాన్‌ చేసింది. మే 6, 8 తేదీల్లో కూటమి తరపున ప్రచారంలో మోదీ పాల్గొంటారు. ఏపీపై బీజేపీ ఫోకస్‌ పెంచింది. ఏపీ ఎన్నికల ప్రచారం చివరి చరణంలో మోదీ రాక వేడి పుట్టిస్తోంది. కూటమి కోసం ప్రచారం చేయడానికి ఏపీ వస్తున్నారు మోదీ. ఇవాళ రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. 8వ తేదీన రాజంపేట పార్లమెంట్‌ స్థానం పరిధిలోని పీలేరులో సభకు మోదీ హాజరవుతారు. అదే రోజు సాయంత్రం విజయవాడలో రోడ్ షోలో పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రికి రానున్నారు ప్రధాని. అక్కడినుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌, ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరితో కలిసి రాజమండ్రి రూరల్‌‎లోని వేమగిరి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరితో పాటు కూటమికి చెందిన ఇతర అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు మోదీ.

రాజమండ్రి రూరల్‌ వేమగిరిలో జరిగే సభకు బీజేపీ భారీగా ఏర్పాట్లు చేసింది. ప్రధాని భద్రత కోసం పోలీసులు భారీగా మోహరించారు. భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ జగదీష్‌, డీఎస్పీ అంబికా ప్రసాద్‌ పర్యవేక్షించారు. రాజమండ్రిలో సభ ముగించుకుని సాయంత్రం 5:45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు మోదీ. తర్వాత అనకాపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌, ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున మోదీ ప్రచారం చేయనున్నారు. ఇక ఈ నెల 8న మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు మోదీ. పీలేరు అసెంబ్లీ పరిధిలోని కలికిరి సభలో, చంద్రబాబు పవన్‌తో కలిసి పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ చేరుకుని..ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకు రోడ్‌ షోలో పాల్గొంటారు మోదీ. ప్రధాని సభలకు పెద్దఎత్తున తరలి రావాలంటూ బీజేపీ శ్రేణులకు, ప్రజలకు పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు. మోదీ ప్రచారంతో క్లైమాక్స్‌లో కాక పెంచాలని చూస్తోంది కూటమి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…