AP News: ఏపీ డీజీపీపై బదిలీ వేటు.. సీఎస్‎కు ఈసీ కీలక ఆదేశాలు..

ఏపీ డీజీపీపై బదిలీ వేటు వేసింది ఈసీ. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని సీఎస్ కు తెలిపింది. రేపు ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించేలా నియామకపత్రాలు పంపాలని సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది.

AP News: ఏపీ డీజీపీపై బదిలీ వేటు.. సీఎస్‎కు ఈసీ కీలక ఆదేశాలు..
Rajendhranath Reddy
Follow us

|

Updated on: May 05, 2024 | 6:49 PM

ఏపీ డీజీపీపై బదిలీ వేటు వేసింది ఈసీ. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని సీఎస్ కు తెలిపింది. రేపు ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించేలా నియామకపత్రాలు పంపాలని సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు కింది స్థాయి అధికారిని తాత్కాలికంగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ముగ్గురు డీజీ ర్యాంకు ఉన్న అధికారుల పేర్లతో ఒక ప్యానల్‎ను సిద్దం చేయాలని సీఎస్‎కు తెలిపింది. 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి 2022 ఫిబ్రవరి నుంచి ఏపీ డీజీపీగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈయన పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏపీలో క్రైం రేటు చాలా వరకు అదుపులోకి వచ్చిందని గతంలో చాలా కథనాలు వెలువడ్డాయి. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక జోన్లలో విధులు నిర్వహించారు. ఎస్పీ (విజయవాడ రైల్వేస్), డీసీపీ (హైదరాబాద్ ఈస్ట్ జోన్), విజయవాడ పోలీస్ కమిషనర్, స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, ఐజీ (విశాఖపట్నం జోన్) వంటి పలు ప్రాంతాల్లో పనిచేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్. రాజేంద్రనాథ్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు. గతంలో డీజీపీ గౌతం సవాంగ్‌ బదిలీ అయిన తరువాత కొత్త డీజీపీగా కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…