AP EAPCET 2024 Hall Ticket: మరో 2 రోజుల్లో ఏపీ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. పరీక్షలు ఎప్పటినుంచంటే!

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఈఏపీసెట్‌) అడ్మిట్‌ కార్డులు మే 7వ తేదీన విడుదలకానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఈఏపీసెట్‌ 2024 పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్‌టీయూకే) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా గతేడాది కంటే ఈ ఏడాది ఈఏపీసెట్‌దరఖాస్తులు భారీగా..

AP EAPCET 2024 Hall Ticket: మరో 2 రోజుల్లో ఏపీ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. పరీక్షలు ఎప్పటినుంచంటే!
AP EAPCET 2024 Hall Ticket
Follow us
Srilakshmi C

|

Updated on: May 05, 2024 | 1:55 PM

అమరావతి, మే 5: ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఈఏపీసెట్‌) అడ్మిట్‌ కార్డులు మే 7వ తేదీన విడుదలకానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఈఏపీసెట్‌ 2024 పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్‌టీయూకే) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా గతేడాది కంటే ఈ ఏడాది ఈఏపీసెట్‌దరఖాస్తులు భారీగా పెరిగాయి. ఇప్పటి వరకూ దాదాపు 3,54,235 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. మే 12 వరకు దరఖాస్తుకు అవకాశం ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

రూ.1000 ఆలస్య రుసుంతో ఈఏపీసెట్ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఈ రోజుతో ముగియనున్నాయి. రూ.5000 ఆలస్య రుసుంతో మే 10వ తేదీ వరకు, రూ.10 వేల ఆలస్య రుసుంతో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అగ్రిక‌ల్చర్‌, ఫార్మసీ పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరుగుతుంది. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశ పరీక్షలు మే 18 నుంచి 23వ తేదీ వరకు జరుగనున్నాయి.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్‌ ప్రొఫెషనల్‌ కాలేజీల్లో.. బీఈ, బీటెక్‌, అగ్రిక‌ల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌టికెట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.