‘లేని చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు చంద్రబాబు’.. ల్యాండ్ టైటిలింగ్ దుష్ప్రచారంపై ఏపీ మంత్రి స్పష్టత..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. ఏపీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సీఎం జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన నియోజకవర్గ పార్ట ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూల్స్ ఇంకా ఫ్రేమ్ కాలేదన్నారు. లేని చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు చెప్తున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను 2019లో నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందని వివరించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. ఏపీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సీఎం జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన నియోజకవర్గ పార్ట ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూల్స్ ఇంకా ఫ్రేమ్ కాలేదన్నారు. లేని చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు చెప్తున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను 2019లో నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందని వివరించారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న 17 వేల గ్రామాల్లో భూముల సర్వే జరుగుతుందని తెలిపారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని రాజమండ్రి సభలో మోదీతో చెప్పిస్తారా? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టం తప్పని చెప్పించమన్నారు. ఈ చట్టాన్ని అమలుచేస్తామని చెప్పిన చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…