AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: 'చంద్రబాబు - లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయం'.. లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు..

Watch Video: ‘చంద్రబాబు – లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయం’.. లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు..

Srikar T
|

Updated on: May 05, 2024 | 4:29 PM

Share

ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైసిపి నేత నందమూరి లక్ష్మీపార్వతి. తాడేపల్లి నులకపేట, ప్రకాష్ నగర్ కాలనీలో మంగళగిరి వైసిపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా నారా లోకేష్ పై మండిపడ్డారు. మంగళగిరిలో లోకేష్ ఎంట్రీ తోనే హత్యా రాజకీయాలు మొదలయ్యాయని ఆరోపించారు. దీనికి ఉదాహరణే వెంకటరెడ్డి హత్య అని ఉదాహరించారు. చంద్రబాబు, నారా లోకేష్ హింసా రాజకీయాలకు పాల్పడే వ్యక్తులు అని విమర్శించారు. ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ పాత్ర కీలకం అన్నారు.

ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైసిపి నేత నందమూరి లక్ష్మీపార్వతి. తాడేపల్లి నులకపేట, ప్రకాష్ నగర్ కాలనీలో మంగళగిరి వైసిపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా నారా లోకేష్ పై మండిపడ్డారు. మంగళగిరిలో లోకేష్ ఎంట్రీ తోనే హత్యా రాజకీయాలు మొదలయ్యాయని ఆరోపించారు. దీనికి ఉదాహరణే వెంకటరెడ్డి హత్య అని ఉదాహరించారు. చంద్రబాబు, నారా లోకేష్ హింసా రాజకీయాలకు పాల్పడే వ్యక్తులు అని విమర్శించారు. ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ పాత్ర కీలకం అన్నారు. రాజధాని భూములు, ఔటర్ రింగు రోడ్డు కేసుల్లో నారా లోకేష్ అప్పటి మంత్రి నారాయణ, పత్తిపాటి పుల్లారావు ఉన్నారని తెలిపారు. ఎన్నికలు అయ్యాక చంద్రబాబు లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయమని జోస్యం చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిజెపి పార్టీకి చెందినదన్నారు. బీజేపీతో కూటమిలో భాగంగా ఉన్న చంద్రబాబు బిజెపిని ఎందుకు ప్రశ్నించట్లేదని అడిగారు. అవినీతికి, దుర్మార్గానికి మారుపేరే చంద్రబాబు అని మండిపడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…