‘తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం’.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి అమిత్ షా
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. సిర్ఫూర్ కాగజ్ నగర్లో బీజేపీ జనసభలో కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసిందని.. మోదీ 100 సీట్లలో గెలిచారని చెబుతూ సెంచరీ కొట్టేశారన్నారు. మూడో దశ పోలింగ్ ముగిసే నాటికి ఈ సంఖ్య 200 దాటుతుందన్నారు. తెలంగాణలో పోలింగ్ సమయానికి బీజేపీకి 250 సీట్లు పక్కాగా వస్తాయని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందన్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. సిర్ఫూర్ కాగజ్ నగర్లో బీజేపీ జనసభలో కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసిందని.. మోదీ 100 సీట్లలో గెలిచారని చెబుతూ సెంచరీ కొట్టేశారన్నారు. మూడో దశ పోలింగ్ ముగిసే నాటికి ఈ సంఖ్య 200 దాటుతుందన్నారు. తెలంగాణలో పోలింగ్ సమయానికి బీజేపీకి 250 సీట్లు పక్కాగా వస్తాయని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 17 స్థానాలకు గాను 10 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో 12లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. దేశంలో ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి మధ్య పోటీ జరుగుతోందన్నారు.
ఓవైపు మోదీ, మరోవైపు రాహుల్ ఉన్నారన్నారు. మోదీ ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారని తెలిపారు. సెలవులు వచ్చాయంటే రాహుల్ బ్యాంకాక్ లో సేదతీరుతారని సెటైర్లు వేశారు. ఈ పదేళ్లలో అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని నిర్మించామని చెప్పారు. 70 ఏళ్ళపాటు కాంగ్రెస్ కాలయాపన చేసిందని విమర్శించారు. బాల రాముడి మందిర ప్రారంభోత్సవానికి ఖర్గే, రాహుల్ లను ఆహ్వానించామని కానీ వారు హాజరుకాలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఏటీఎంలా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల ప్రభుత్వం అని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనతో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ముస్లీం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో అమలు కావన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు ఆ రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. తనపై తెలంగాణ సీఎం ఫేక్ వీడియోలను సర్క్యూలేట్ చేస్తున్నారని ఆరోపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు
ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే
పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్
నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్

