‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్దే’.. ప్రచారంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేపట్టారు మాజీ సీఎం కేసీఆర్. 48 గంటల తరువాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ వీణవంకలో పర్యటించారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుందని తెలిపారు. కేవలం నాలుగు అయిదు నెలల్లోనే పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుది వరకు కొనసాగదన్నారు.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేపట్టారు మాజీ సీఎం కేసీఆర్. 48 గంటల తరువాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ వీణవంకలో పర్యటించారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుందని తెలిపారు. కేవలం నాలుగు అయిదు నెలల్లోనే పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుది వరకు కొనసాగదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు మధ్యలో వచ్చినా, షెడ్యూల్ ప్రకారం వచ్చినా ఈసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పి కార్యకర్తల్లో జోష్ నింపారు. తనను నమ్మండని చెప్పారు. తెలంగాణలో ఇంకా చాలా మంచి జరగాల్సి ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం కాంగ్రెస్ చెప్పిన పథకాలే అన్నారు. తమకంటే ఎక్కువ లబ్ధి ఇస్తామన్నందుకే కాంగ్రెస్ గెలిచిందని ఎన్నికల ప్రచార వేదికగా వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

