Watch Video: అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి.. హోం మంత్రి తానేటి వనిత ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందంటూ నానా యాగీ చేసి, ఇప్పుడు అవే పథకాలు రెట్టింపు ఇస్తామంటూ టీడీపీ మభ్యపెడుతోందన్నారు హోం మంత్రి తానేటి వనిత. సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే సత్తాలేకనే విపక్షపార్టీలన్నీ కలిసి కూటమిగా వస్తున్నాయన్నారు.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందంటూ నానా యాగీ చేసి, ఇప్పుడు అవే పథకాలు రెట్టింపు ఇస్తామంటూ టీడీపీ మభ్యపెడుతోందన్నారు హోం మంత్రి తానేటి వనిత. సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే సత్తాలేకనే విపక్షపార్టీలన్నీ కలిసి కూటమిగా వస్తున్నాయన్నారు. 2014లో అసత్యాలు చెప్పి అధికారంలోకొచ్చినట్లే మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు తానేటి వనిత.
జగనన్న వస్తే మీ భూమి లాక్కుంటాడని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారన్నారు హోంమంత్రి. కొవ్వూరు నియోజకవర్గంతో పాటు గోపాలపురం నియోజకవర్గం కూడా ప్రజలు కూడా తనను ఆదరిస్తారని, జగనన్న అభీష్టం మేరకే గోపాలపురంలో పోటీచేస్తున్నానన్నారు తానేటి వనిత. గోపాలపురం ప్రజలు తనని గుండెల్లో పెట్టుకుంటున్నారని చెప్పారు తానేటి వనిత.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

