ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌‎ దుష్ప్రచారంపై కేసు నమోదు.. ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేష్..

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌‎పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదైంది. చంద్రబాబును ఏ1గా, లోకేష్‌ను ఏ2గా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది సీఐడీ. వీరిద్దరితో పాటు ఐవీఆర్ఎస్‌ కాల్స్‌ చేసిన ఏజెన్సీలపై కూడా కేసు నమోదైంది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై..తక్షణం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌‎ దుష్ప్రచారంపై కేసు నమోదు.. ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేష్..
Chandrababu, Lokesh
Follow us
Srikar T

|

Updated on: May 05, 2024 | 8:05 PM

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌‎పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదైంది. చంద్రబాబును ఏ1గా, లోకేష్‌ను ఏ2గా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది సీఐడీ. వీరిద్దరితో పాటు ఐవీఆర్ఎస్‌ కాల్స్‌ చేసిన ఏజెన్సీలపై కూడా కేసు నమోదైంది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై..తక్షణం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించిన వైసీపీ.. దానికి సంబంధించిన ఆధారాలనూ ఈసీకి అందించింది.

ఎలక్షన్‌ కోడ్‌కు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని.. ఏపీ సీఐడీని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐడీ..వెంటనే విచారణ చేపట్టింది. ఫేక్‌ ప్రచారం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1గా, లోకేష్‌ను ఏ2గా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అలాగే ఐవీఆర్ఎస్‌ కాల్స్‌ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదైంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ను పూర్తి పారదర్శకంగా అమలు చేయాలని భావిస్తోంది..వైసీపీ ప్రభుత్వం. భూముల వివాదాలు శాశ్వతంగా పరిష్కరించే దిశగా.. భూమిపై సంపూర్ణ హక్కులు ఆ లబ్దిదారులకే దక్కేలా చేయాలని తాము చూస్తుంటే.. దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే పేదల భూములకు రక్షణ ఉండదని ఆరోపిస్తున్న విపక్షాలు.. ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక యాడ్‌లను కూడా షూట్‌ చేసి రిలీజ్‌ చేశాయి. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై సోషల్‌మీడియాలో కూడా పెద్దఎత్తున తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ చట్టంపై వాస్తవాలను ప్రజలు ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌.. విపక్షాలకు కౌంటర్‌ ఇచ్చారు. భూమిమీద సంపూర్ణ హక్కులను రైతులకు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ అని స్పష్టం చేశారు..సీఎం జగన్‌. చంద్రబాబు ముందు ఈ విషయం తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. రాబోయే రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గొప్ప సంస్కరణ అవుతుందన్నారు. ప్రస్తుతం భూ వివాదాల వల్ల ప్రజలు..అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని..ఆ పరిస్థితి ఇకపై ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ యాక్ట్‌కు రూపకల్పన జరిగిందన్నారు. సర్వే పూర్తయ్యాక ఆ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఏపీలో వందేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో భూ సర్వే జరుగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పూర్తిస్థాయిలో సర్వే నిర్వహిస్తోంది ప్రభుత్వం. సర్వే పూర్తయ్యాక రాష్ట్రంలో ల్యాండ్ రికార్డులు అప్ డేట్ చేస్తామని చెబుతోంది. ఆ తర్వాత రైతులకు ఇచ్చే సంపూర్ణ హక్కు పత్రాలకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుందని స్పష్టం చేశారు సీఎం జగన్‌. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ఇంకా ఏ రాష్ట్రంలోనూ అమలులోకి రాలేదు. అమలుకు అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలే ఇంకా జారీ చేయలేదు. ఈ లోపే కొన్ని పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఈసీ స్పందించడంతో పాటు చర్యలకు కూడా ఆదేశించడంతో ఈ తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట పడ్డట్టేనని భావిస్తోంది ప్రభుత్వం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…