AP Weather: మండే ఎండలకు బ్రేక్.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

మండే ఎండలకు బ్రేక్. అవును ఏపీకి వర్షసూచన వచ్చింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం...

AP Weather: మండే ఎండలకు బ్రేక్.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
Andhra Weather Report
Follow us

|

Updated on: May 05, 2024 | 6:41 PM

ఏపీ ప్రజలకు పిడుగులతో కూడిన వర్షాల అలెర్ట్ వచ్చింది. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడుతుందన్నారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

సోమవారం 29 మండలాల్లో, ఎల్లుండి 15 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.సోమవారం శ్రీకాకుళం10, విజయనగరం 13, పార్వతీపురంమన్యం 6 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

ఆదివారం నంద్యాల జిల్లా మహానందిలో 45.8°C, కర్నూలు జిల్లా జి. సింగవరంలో 45.6°C, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 45.5°C, ప్రకాశం జిల్లా వెలిగండ్లలో 45.2°C, తిరుపతి జిల్లా మంగనెల్లూరు, వైయస్సార్ జిల్లా ఉప్పలూరు, సింహాద్రిపురంలో 45.1°C, అన్నమయ్య జిల్లా టిసుండుపల్లె 44.7°C, పల్నాడు జిల్లా రావిపాడులో 44.4°C, చిత్తూరు జిల్లా పుంగనూరులో 43.6°C, ఎన్టీఆర్ జిల్లా వీరులపాడులో 43.3°C, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 43.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 5 మండలాల్లో తీవ్రవడగాల్పులు,117 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ఎండతీవ్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం