AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Getup Srinu: రోజా కామెంట్స్‌పై గెటప్ శ్రీను రియాక్షన్ ఇదే.. సూటిగా.. సుత్తిలేకుండా

తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్‌ శ్రీను స్పందించారు. పవన్‌ కల్యాణ్‌పై అభిమానం ఉంది కాబట్టే.. జనసేన తరఫున ప్రచారం చేసినట్లు తెలిపారు. తమ అంతట తామే ఫోన్‌ చేసి మరీ ప్రచారానికి వెళ్లాం తప్ప వాళ్లు రమ్మని అడగలేదన్నారు గెటప్ శ్రీను.

Getup Srinu: రోజా కామెంట్స్‌పై గెటప్ శ్రీను రియాక్షన్ ఇదే.. సూటిగా.. సుత్తిలేకుండా
Getup Srinu - Roja
Ram Naramaneni
|

Updated on: May 05, 2024 | 6:11 PM

Share

మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే భయంతోనే కొందరు జబర్దస్త్ ఆర్టిస్టులు ఆ కుటుంబానికి మద్దతుగా ఉంటున్నారని ఇటీవల ఏపీ మంత్రి రోజా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆమె ఓ లాజిక్ కూడా చెప్పారు. మెగా ఫ్యామిలీ ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కి సపోర్ట్‌ చేసినప్పుడు ఇంతమంది ఉన్నా ఆయనెందుకు గెలవలేదని రోజా ప్రశ్నించారు. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్‌ వంటివారిని అనడం వేస్ట్ అని.. వారితో ఎవరు మాట్లాడిస్తున్నారో వారి గురించి ఆలోచించాలని వ్యాఖ్యానించారు. తాజాగా ‘రాజు యాదవ్‌’ సినిమా ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్‌లో రోజా కామెంట్స్‌పై గెటప్ శ్రీను స్పందించారు. మెగా ఫ్యామిలీతో మాత్రమే కాకుండా.. వెంకటేశ్‌, ఎన్టీఆర్‌, నాని వంటి హీరోలతోనూ సినిమాలు చేసినట్లు గుర్తు చేశారు. ఇతర హీరోల చిత్రాల్లో కూడా తనకు ఆఫర్లు వస్తున్నాయని చెప్పారు. ఏ మనిషి అయినా అందరికీ నచ్చాలని లేదు అని.. పవన్‌ కల్యాణ్‌పై అభిమానం ఉంది కాబట్టే.. జనసేన తరఫున ప్రచారం చేసినట్లు చెప్పుకొచ్చారు. పిఠాపురంలో ప్రచారానికి మంచి స్పందన లభించిందని.. పవన్ లక్ష మెజారిటీతో గెలుస్తారని గెటప్ శ్రీను జోస్యం చెప్పారు. జనసేన నుంచి ఎవరూ తమని రమ్మని పిలవలేదని.. పవన్‌పై ఉన్న ఇష్టంతోనే… తమంతట తామే ప్రచారానికి వెళ్లినట్లు గెటప్ శ్రీను చెప్పారు.

కాగా పిఠాపురంలో సినిమా స్టార్ల సందడి కొనసాగుతోంది. పవన్, నాగబాబు వంటివారు ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా క్యాంపెయిన్ చేశారు. త్వరలో సాయి దుర్గ తేజ్‌ కూడా వెళ్లనున్నారు. పలువురు జబర్దస్త్ ఆర్టిస్టులు, సినిమా, సిరియల్ నటీనటులు పిఠాపురంలో పవన్ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!