AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. ఈ రోజు శివయ్య అనుగ్రహం కోసం ఇలా పూజ చేయండి..

ప్రతినెలా కృష్ణ పక్షం చతుర్దశి రోజున మాస శివరాత్రి ఉపవాసం చేస్తారు. నెలవారీ శివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల శంకరుడు ఎంతో సంతోషిస్తాడనే మత విశ్వాసం. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల భగవంతుడు భక్తుని కోరికలన్నీ తీరుస్తాడు. నెలవారీ శివరాత్రి నాడు ఉపవాస దీక్షకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు దేవతల దేవుడైన మహాదేవ్‌ను పూజించడానికి అంకితం చేయబడింది. చైత్ర మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి ఈ రోజు ( మే 6వ తేదీ సోమవారం) మధ్యాహ్నం 2:40 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మే 7వ తేదీ మంగళవారం ఉదయం 11:40 గంటలకు ముగుస్తుంది. కనుక  ఉదయ తిథి ప్రకారం సోమవారం మాస శివరాత్రి ఉపవాసం చేస్తారు.  

మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. ఈ రోజు శివయ్య అనుగ్రహం కోసం ఇలా పూజ చేయండి..
Maasa Shiva Ratri Puja
Surya Kala
|

Updated on: May 06, 2024 | 6:49 AM

Share

మాస శివరాత్రి, సోమవారం రెండూ శివునికి అంకితం చేయబడ్డాయి. ఈసారి చైత్ర మాస మాస శివరాత్రి సోమవారం వచ్చింది. అలాగే ఈ రోజు నెలవారీ శివరాత్రి రోజున అనేక శుభ యోగాలు యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయి. ప్రీతి యోగా, ఆయుష్మాన్ యోగాలు కూడా సోమవారం నాడు ఏర్పడనున్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ మాస శివరాత్రి అనేక శుభ యోగాలతో జరుపుకుంటున్నారు. ఈ పవిత్రమైన యోగాలతో మీరు పూజలు, ప్రార్థనలు, ఉపవాసాల మరిన్ని ఫలితాలను పొందుతారు. శివయ్య ఆశీర్వాదం లభిస్తుంది. మాస  శివరాత్రి ఉపవాసం జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందని నమ్ముతారు.

ప్రతినెలా కృష్ణ పక్షం చతుర్దశి రోజున మాస శివరాత్రి ఉపవాసం చేస్తారు. నెలవారీ శివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల శంకరుడు ఎంతో సంతోషిస్తాడనే మత విశ్వాసం. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల భగవంతుడు భక్తుని కోరికలన్నీ తీరుస్తాడు. నెలవారీ శివరాత్రి నాడు ఉపవాస దీక్షకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు దేవతల దేవుడైన మహాదేవ్‌ను పూజించడానికి అంకితం చేయబడింది.

చైత్ర మాస శివరాత్రి 2024 ముహూర్తం

చైత్ర మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి మే 6వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2:40 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మే 7వ తేదీ మంగళవారం ఉదయం 11:40 గంటలకు ముగుస్తుంది. కనుక  ఉదయ తిథి ప్రకారం సోమవారం మాస శివరాత్రి ఉపవాసం చేస్తారు.

మాస శివరాత్రి పూజ

తేనె, దేశీ నెయ్యి, ఉమ్మెత్త పువ్వులు, పెరుగు, పువ్వులు, బిల్వ పత్రాలు, విభూతి, చందనం, దీపం, పూజ పాత్రలు, గంగాజలం, స్వచ్ఛమైన నీరు.

మాస శివరాత్రి పూజ విధి

  1. మహాదేవుని ఆశీస్సులు, ఆశీర్వాదాలు పొందాలనుకుంటే నెలవారీ శివరాత్రి వ్రతాన్ని ఆచరించవచ్చు. నియమాల ప్రకారం ఉపవాసం ఉండి, శంకరుడిని పూజించాల్సి ఉంటుంది. ఈ శుభసందర్భంలో  ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, ధ్యానం చేయండి. శివుని ముందు ఉపవాసం ఉంటానని ప్రమాణం చేసి, ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిని అన్ని ఆచారాలతో అలంకరించండి.
  2. తరువాత, ఈ  పీఠంపై శివ కుటుంబం ఉన్న చిత్ర పటాన్ని ప్రతిష్టించి.. ఆపై పంచామృతంతో అభిషేకం చేయండి. దీని తరువాత  శివుడికి చందనం తిలకంగా దిద్దండి. తల్లి పార్వతి దేవికి కుంకుమ పెట్టండి
  3. ఆవు నెయ్యి దీపం వెలిగించండి. తర్వాత బియ్యం పాయసం నైవేద్యంగా పెట్టి తెల్లని పువ్వులను దేవుడికి సమర్పించాలి. పూజలో బిల్వ పత్రాలను సమర్పించండి.
  4. పూజ సమయంలో నిర్మల హృదయంతో శివ చాలీసాను పఠించండి. చివరిలో హారతిని ఇచ్చి పూజను పూర్తి చేయండి.
  5. మహా శివరాత్రి రోజున మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే బోల్షన్కారుడు సంతోషిస్తాడు. భక్తులను అనుగ్రహిస్తాడు.

మాస శివరాత్రి పూజలో చేయకూడని పొరపాట్లు

శివుడిని పూజించేటప్పుడు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి. మాస శివరాత్రి లేదా శివుని పూజించే ఏ రోజు అయినా పూజలో తులసి, పసుపు,  కేతకి పుష్పాలను ఉపయోగించడం కూడా మర్చిపోవద్దు.

పూజ పూర్తయిన తర్వాత ఏదైనా తెలిసి తెలియక చేసే తప్పులను క్షమించమని శివయ్యను కోరండి. మర్నాడు రోజు ఉదయం శివునికి ప్రసాదం సమర్పించి ఉపవాసం విరమించండి. ఇలా చేయకపొతే ఉపవాసం పూర్తి ఫలితాలను పొందలేరు.

నెలవారీ శివరాత్రి పూజ సమయంలో ఈ మంత్రాలను జపించండి

శివ మూల మంత్రం– ఓం నమః శివాయ॥

రుద్ర మంత్రం:  ఓం నమో భగవతే రుద్రాయ.

రుద్ర గాయత్రీ మంత్రం– ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్॥ ఓం భూర్ భువః స్వాహా ఓం తద్పురుషాయ విద్వామహే, మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్॥

 మహామృత్యుంజయ మంత్రం: ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు