AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిందూ మతంలో ఈశాన్య దిశ ప్రాముఖ్యత ఏమిటి? ఈ దిశలో ఏ పని చేయాలి? ఏమి చేయకూదంటే..?

వాస్తు శాస్త్రంలో ఎనిమిది దిశల గురించి వివరంగా వివరించారు. ఈ దిశలలో ఒకటి  ఈశాన్య దిశ. జ్యోతిష్కులు, పండితులు సహా ప్రతి ఒక్కరూ ఈ దిశలో పూజలు లేదా మంత్రాలను పఠించమని సిఫార్సు చేస్తారు. ఈ దిశలో కూర్చొని తరచుగా మతపరమైన,  శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ దిక్కున కూర్చొని మంత్రాలు జపిస్తే మనిషి త్వరగా సిద్ధి పొందగలడు. మతపరమైన దృక్కోణంలో ఈశాన్య మూలకు చాలా ప్రాముఖ్యత ఉంది.

హిందూ మతంలో ఈశాన్య దిశ ప్రాముఖ్యత ఏమిటి? ఈ దిశలో ఏ పని చేయాలి? ఏమి చేయకూదంటే..?
Vastu Tips For Eshanya Dish
Surya Kala
|

Updated on: May 06, 2024 | 1:11 PM

Share

హిందూ మతంలో వాస్తుకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఒకొక్క దిశ ఒకొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. ఇంటి ఈశాన్య దిశను పూజకు అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. ఈ దిశ తూర్పుకి, ఉత్తరానికి మధ్యన ఉన్న ఒక దిక్కు. హిందూ విశ్వాసాల ప్రకారం దేవుడు ఈ దిశలో నివసిస్తాడని నమ్మకం. అందువల్ల ఇంట్లో ఈ దిశలో ఏదైనా ఉంచే ముందు వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని నియమాలను తప్పని సరిగా పాటించాలని సూచిస్తారు. ప్రతి దిశ, ప్రతి కోణం ప్రాముఖ్యత వాస్తు శాస్త్రంలో వివరించబడింది. ఆ దిశ ప్రత్యేకత మేరకు ఆ దిశగా శుభ ఫలితాలు లభిస్తాయి.

వాస్తు శాస్త్రంలో ఎనిమిది దిశల గురించి వివరంగా వివరించారు. ఈ దిశలలో ఒకటి  ఈశాన్య దిశ. జ్యోతిష్కులు, పండితులు సహా ప్రతి ఒక్కరూ ఈ దిశలో పూజలు లేదా మంత్రాలను పఠించమని సిఫార్సు చేస్తారు. ఈ దిశలో కూర్చొని తరచుగా మతపరమైన,  శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ దిక్కున కూర్చొని మంత్రాలు జపిస్తే మనిషి త్వరగా సిద్ధి పొందగలడు. మతపరమైన దృక్కోణంలో ఈశాన్య మూలకు చాలా ప్రాముఖ్యత ఉంది.

ఈశాన్య మూలలో మతపరమైన ప్రాముఖ్యత

మతపరమైన దృక్కోణం నుంచి చూస్తే దేవతలు ఈశాన్య మూలలో నివసించినట్లు భావిస్తారు. అందుకే ఇల్లు లేదా ఆఫీసు పూజా స్థలాన్ని ఈశాన్య మూలలో ఉంచాలని సూచించారు. ఈ దిశలో కూర్చొని పూజ చేయమని చెబుతారు. సానుకూల శక్తి ఎల్లప్పుడూ ఈ దిశలో ప్రవహిస్తుందని నమ్ముతారు. అందువల్ల వాస్తు శాస్త్రంలో అలాగే మత గ్రంధాలలో ఈ దిశను చాలా పవిత్రంగా, శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశలో పరిశుభ్రతను పాటించి.. పూజ గదిని లేదా దేవుళ్ళ పటాలను పెట్టి పూజించినట్లయితే జీవితంలో ఎప్పుడూ సమస్యలు ఎదురుకావు.

ఇవి కూడా చదవండి

ఈశాన్య మూలలో పూజ ప్రాముఖ్యత

హిందూ మతంలో ఈశాన్య మూలలో ప్రార్థనా స్థలం ఉండటం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దిశలోని గోడల రంగు పసుపు రంగులో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. డబ్బును ఈ దిశలో ఉంచవచ్చు . అయితే వాస్తులో డబ్బు ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం ఉత్తర దిశగా పరిగణించబడుతుంది. ఈశాన్య దిశలో కూర్చుని ఆరాధించిన ప్రజలు ఎప్పుడూ సమస్యలను ఎదుర్కొనరు.  జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు.

ఈశాన్య దిశలో పొరపాటున కూడా ఈ పనులు చేయరాదు

వాస్తు ప్రకారం ఇంట్లో ఈశాన్య మూలలో ఏదైనా బరువైన వస్తువును ఉంచడం అశుభం. ఈ స్థలంలో బరువైన వస్తువులు ఉంచితే ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుంది. ఈశాన్య మూలలో స్టోర్ రూమ్ మొదలైన వాటిని ఏర్పాటు చేయవద్దు. ఈ దిశ దేవతల నివాసం అని నమ్మకం. ఈ దిశలో ఎప్పుడూ బూట్లు, చెప్పులు లేదా చెత్తను నిల్వ చేయవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. అంతేకాదు ఆర్ధిక పరమైన  రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు