నడిరోడ్డు మీద కదులుతున్న గుడిసె.. టార్జాన్ ది వండర్ కార్ వీడియో నెట్టింట్లో వైరల్

రోడ్డుపై నడుస్తున్న గుడిసెను ఎప్పుడైనా చూసారా..  'టార్జాన్ ది వండర్ కార్' సినిమాలో ఇలాంటి సన్నివేశం చూసి ఉంటారు. అయితే నిజజీవితంలో చాలా అరుదుగా ఇలాంటివి చూసి ఉంటారు. అయితే మీరు ఇంకా ఇలాంటి కారుని .. రోడ్డుమీద నడుస్తున్న గుడిసె వంటి కారు వంటి దృశ్యాన్ని చూడకపోతే.. ఈ రోజు మేము మీ కోసం ఒక వీడియోను తీసుకువచ్చాము. రోడ్డుపై ఆనందంగా కదులుతున్న గుడిసె కనిపిస్తుంది.

నడిరోడ్డు మీద కదులుతున్న గుడిసె.. టార్జాన్ ది వండర్ కార్ వీడియో నెట్టింట్లో వైరల్
Hut Car VideoImage Credit source: Instagram
Follow us
Surya Kala

|

Updated on: May 06, 2024 | 11:29 AM

ఇంటర్నెట్ ప్రపంచంలో యాక్టివ్‌గా ఉన్నట్లయితే..  ప్రతిరోజూ రకరకాల వీడియోలను చూస్తారు. కొన్ని రకాల వీడియోలు ఎవరినైనా ఆశ్చర్యపరుస్తాయి. ఇటీవలి కాలంలో కూడా అలాంటి వీడియో జనాల్లో వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తి  కారుని గుడిసెగా మార్చి రోడ్డుపై ఆనందంగా నడుపుతూ కనిపించాడు. అది చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.

రోడ్డుపై నడుస్తున్న గుడిసెను ఎప్పుడైనా చూసారా..  ‘టార్జాన్ ది వండర్ కార్’ సినిమాలో ఇలాంటి సన్నివేశం చూసి ఉంటారు. అయితే నిజజీవితంలో చాలా అరుదుగా ఇలాంటివి చూసి ఉంటారు. అయితే మీరు ఇంకా ఇలాంటి కారుని .. రోడ్డుమీద నడుస్తున్న గుడిసె వంటి కారు వంటి దృశ్యాన్ని చూడకపోతే.. ఈ రోజు మేము మీ కోసం ఒక వీడియోను తీసుకువచ్చాము. రోడ్డుపై ఆనందంగా కదులుతున్న గుడిసె కనిపిస్తుంది. రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరి చూపు ఈ గుడిసెపైనే ఉంటుంది. ఈ దృశ్యాన్ని అందరూ తమ ఫోన్లలో బంధించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

View this post on Instagram

A post shared by Crazy XYZ (@amit.yt)

ఒక వ్యక్తి తన కారు పైకప్పును తొలగించి, దానికి ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చినట్లు వీడియోలో మీరు చూడవచ్చు. కారు పైకప్పును తొలగించి, దానిపై గడ్డిని పరిచి.. ఒక గుడిసెగా అమర్చాడు. ఇది ఖచ్చితంగా గుడిసెలా కనిపిస్తుంది. అయితే ఈ కారు రహదారిపై కదులుతున్నప్పుడు.. చూసిన వారు ఈ కారుని  ఇలా ఎందుకు చేశారా అని ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియో Amit.yt అనే ఖాతాతో Instaలో భాగస్వామ్యం చేయబడింది. ఈ వార్త రాసే వరకు వేల మంది దీన్ని లైక్ చేసి, కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘ఇది చూసిన తర్వాత నాకు టార్జాన్ చిత్రం గుర్తుకు వచ్చింది.’ ‘ఈరోజుల్లో ప్రయోగం పేరుతో ఏమైనా చేస్తున్నారు’ అని మరొకరు రాశారు. మరొకరు ఇలా వ్రాశారు, ‘ఒక గుడిసె కదులుతున్నట్లు కనిపిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..