తల్లి పిల్ల బంధానికి నిర్వచనం ఈ వీడియో.. తల్లి ఏనుగు కోసం గున్న ఏనుగు ఆరాటం.. క్యూట్ వీడియో వైరల్
మూగ జంతువుల అమాయకత్వం మనసుని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అందమైన ఏనుగులను చూడటం చాలా ఆనందంగా ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి క్యూట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అడవుల్లో గడ్డిలో ఒక ఏనుగు గుంపు ఉంది. అక్కడ ఓ గున్న ఏనుగు పిల్ల చకచకా పరుగెడుతూ అక్కడ ఉన్న ఏనుగులను తప్పించుకుని తన తల్లి ఏనుగు వద్దకు పరుగెత్తుకుని వెళ్లి చేరుకుంది. ఈ క్యూట్ వీడియో వీక్షకుల దృష్టిని ఆకట్టుకుంది.
తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తల్లి బిడ్డల మధ్య ప్రేమ, బంధం, అనుబంధం గురించి వర్ణించడానికి మాటలు చాలవు. మనుషుల్లో మాత్రమే కాదు పశుపక్ష్యాదుల్లో కూడా తల్లిపిల్లల మధ్య ప్రేమ ఎప్పుడూ అపురూపం అనిపిస్తుంది. అంతేకాదు అమాయక జీవుల జీవన విధానం చూడడానికి చాలా ఉల్లాసంగా ఉంటుంది. మూగ జంతువుల అమాయకత్వం మనసుని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అందమైన ఏనుగులను చూడటం చాలా ఆనందంగా ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి క్యూట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అడవుల్లో గడ్డిలో ఒక ఏనుగు గుంపు ఉంది. అక్కడ ఓ గున్న ఏనుగు పిల్ల చకచకా పరుగెడుతూ అక్కడ ఉన్న ఏనుగులను తప్పించుకుని తన తల్లి ఏనుగు వద్దకు పరుగెత్తుకుని వెళ్లి చేరుకుంది. ఈ క్యూట్ వీడియో వీక్షకుల దృష్టిని ఆకట్టుకుంది.
కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌లో వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఫిలిప్ ఈ దృశ్యాన్ని తీశారు. ఈ వీడియోను అతను (@sightingsbyphil) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:
View this post on Instagram
వైరల్ వీడియోలో ఒక పిల్ల ఏనుగు తన తల్లి వద్దకు ఆనందంగా చిన్న చిన్న అడుగులతో పరుగెత్తుతూ చేరుకునే ప్రయత్నం చేస్తోంది. అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావా నేను వచ్చేశా అన్నట్లు తల్లిదగ్గరకు చేరుకొని ఆనందంగా తల్లిదగ్గరకు చేరుకుంది. ఈ గున్న ఏనుగు తల్లి ప్రేమ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఏప్రిల్ 20న షేర్ చేసిన ఈ వీడియోకు ఐదున్నర లక్షలకు పైగా వ్యూస్ రావడంతో పాటు చిన్న ఏనుగు క్యూట్ వీడియోను చూసి నెటిజన్లు కూడా ఆనందంలో మునిగితేలుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..