Viral News: బాబోయ్ పులి… పట్టపగలు రోడ్ల వెంట పరిగెడుతూ… ప్రజల్ని హడలెత్తిస్తోంది.. ఎక్కడంటే..!
రోడ్ల వెంట పరిగెడుతున్న పులిని చూసిన కొందరు స్థానికులు భయంతో అక్కడ్నుంచి పరుగులు తీశారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఎక్కడ పడితే అక్కడ పులులే కనిపిస్తున్నాయి. దీంతో ఇక్కడి ప్రజలు కూడా పులి భయంతో వణికిపోయారు. ఈ వార్తలను గమనించిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, అసలు విషయం కనిపెట్టారు.
సోషల్ మీడియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ ఫోటో, వీడియో అయినా మనం ఇంట్లోనే కూర్చుని ఈజీగా చూసేస్తున్నాం. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. అందులో వైరల్ అవుతున్న అనేక ఫన్నీ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. తరచుగా జంతువుల అనేక ఫోటోలు కూడా ఇక్కడ వైరల్ అవుతాయి. వాటికి లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే తరహా ఫోటో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇదిక ఒక ఆసక్తికర ఫోటో. ఇది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.
వైరల్ ఫోటోలో ఒక వింత జంతువు కనిపించింది. అది రూపంలో పులిలా కనిపిస్తుంది. కానీ, దాని హవభావాలు చూస్తుంటే మాత్రం అదేదో వింత జంతువుగా అనిపిస్తుంది. కానీ, ముందు అది పులి అనుకున్న పాండిచ్చేరి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఈ జంతువును చూసి పులి అనుకున్నారు.. భయంతో అక్కడ్నుంచి పరుగులు తీశారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఎక్కడ పడితే అక్కడ పులులే కనిపిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో పులుల భీభత్సం వ్యాపించింది. ఈ వార్తలను గమనించిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, అసలు విషయం కనిపెట్టారు.
పోలీసులు చెప్పిన మేరకుజజ అది పులి కాదు.. కుక్క అని తేలింది. పులిలా భయపెట్టేందుకు కుక్కకు పులిలా నారింజ, నలుపు రంగు చారలు వేశారు కొందరు పోకిరీలు. అందుకే దూరం నుంచి పులిలా కనిపించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విచారణకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ, ..ఈ ప్రాంతంలో పులుల సంచారం లేదని చెప్పారు. అందువల్ల ఈ ప్రాంతంలో పులి సంచరించే అవకాశం లేదన్నారు. కొంతమంది పోకిరీలు కావాలనే ఇలా వీధి కుక్కను పులిలా రంగులు వేశారని చెప్పారు. రాత్రి చీకటిలో అతడు దీన్ని చూడగానే పులి అనుకున్నాడు. అంతే కాకుండా, ఆ అల్లరి మూకలు కుక్కను పులిలా చిత్రీకరించి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. కొన్నేళ్ల క్రితం గోవాలో ఓ రైతు తన పెంపుడు కుక్కకు పులి రంగు వేసేందుకు ఓ ఉపాయం చేశాడు. పొలంలో పంటలను పాడు చేస్తున్న కోతులను తరిమికొట్టేందుకు ఇలా చేశాడు. అతను ఈ కుక్కను తనతో పాటు పొలానికి తీసుకెళతాడు. కుక్కను పులి అని తప్పుగా భావించి కోతులన్నీ పారిపోయేవి.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..