AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. వీళ్లు ఏంట్రా బాబు.. నల్లత్రాచుకు నట్టింట పూజలు..

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంట్లో కొందరు పూజలు చేస్తున్నారు. అందరూ ఎంతో భక్తిగా కూర్చుని పూజలో పాల్గొన్నారు. వారంతా చేసేది ఏ సత్యనారాయణవ్రతమో కాదు.. ఏకంగా ఓ పెద్ద నాగుపామును తీసుకొచ్చి పళ్లెంలో కూర్చోబెట్టి పాలాభిషేకం చేస్తూ పూజలు చేస్తున్నారు. అదికూడా ప్రమాదకరమైన బ్లాక్‌ కోబ్రా.. దానిని చూస్తుంటేనే గుండెజారిపోతుంది.

Viral Video: వామ్మో.. వీళ్లు ఏంట్రా బాబు..  నల్లత్రాచుకు నట్టింట పూజలు..
Snake
Ram Naramaneni
|

Updated on: May 05, 2024 | 2:49 PM

Share

పాములంటే సాధారణంగా అందరికీ భయమే. కొందరు పాము పేరు చెప్పగానే ఆమడదూరం పరుగెడతారు. అయినా హిందూ సంప్రదాయంలో పాములను దేవతగా ఆరాధిస్తారు. పాలు పోసి పూజలు చేస్తారు.అయితే  పుట్టల దగ్గరో, లేక ఆలయాల్లోనో పూజలు చేస్తారు. కానీ ఓ కుటుంబం ఏకంగా ప్రమాదకరమైన నాగుపామును తీసుకొచ్చి ఇంట్లోనే పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంట్లో కొందరు పూజలు చేస్తున్నారు. అందరూ ఎంతో భక్తిగా కూర్చుని పూజలో పాల్గొన్నారు. వారంతా చేసేది ఏ సత్యనారాయణవ్రతమో కాదు.. ఏకంగా ఓ పెద్ద నాగుపామును తీసుకొచ్చి పళ్లెంలో కూర్చోబెట్టి పాలాభిషేకం చేస్తూ పూజలు చేస్తున్నారు. అదికూడా ప్రమాదకరమైన బ్లాక్‌ కోబ్రా.. దానిని చూస్తుంటేనే గుండెజారిపోతుంది. అలాంటిది ఆ పాము చుట్టూ అందరూ కూర్చుని అర్చకుడు మంత్రాలు చదువుండగా నాగుపాముకు పూజలు చేశారు. ఆ నాగుపాము పళ్లెంలో చుట్టూ తిరుగుతూ ఎవరిని కాటువేద్దామా అన్నట్టుగా చూస్తోంది. ఓసారి ఎవరినో కాటేయబోయింది కూడా. కానీ తప్పించుకున్నారు. అయినా ఎవ్వరూ భయపడలేదు, అక్కడినుంచి కదలనూలేదు. పూజలు కంటిన్యూ చేసారు. ఇది ఏ ప్రాంతంలో, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ, వీడియో చూస్తే శివరాత్రి సందర్భంగా ఆ కుటుంబం పామును పూజించినట్లు తెలుస్తోంది. ఓంకార్ సనాతని పేరుతో ఓ నెటిజన్ ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. హిందూ సంస్కృతిలో శివుడు, నాగ దేవతకు ఉన్న ప్రాధాన్యత గురించి అందులో వివరించాడు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను ఏకంగా 3.68 లక్షలమంది లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అవాక్కవుతున్నారు. కొందరు ఆ ఫ్యామిలీ ధైర్యాన్ని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం ప్రాణం మీదకు తెచ్చే ఇలాంటి పూజలు సరికాదని విమర్శించారు. ఓ యూజర్ అయితే శివరాత్రి కాబట్టి పామును పూజించారు.. దుర్గా నవరాత్రులు అయితే పులినో లేక సింహానో కూర్చోబెట్టి పూజిస్తారా? అంటూ కామెంట్‌ చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?